ఈ పుట ఆమోదించబడ్డది

702

ఒక యోగి ఆత్మకథ

చడమన్నది అరుదు. ఒకసారి నాకు, అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది,” అంటూ చెప్పి ఆ స్వామి, వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు.[1]

“అప్పుడప్పుడు నేను, కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నా ఏకాంతవాసంలోంచి బయటికి వచ్చేవాణ్ణి. హిమాలయారణ్యాల్లో నేను అంతూపొంతూ లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేళాకోళం చేస్తూండేవారు.”

“ ‘నీ అరికాల్లో చక్రం ఉంది,’ అన్నా రొకసారి ఆయన నాతో. ‘పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం.’ ”

“చాలాసార్లు, మహాసమాధికి ముందూ తరవాతా కూడా, లాహిరీ మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు, ఆయన చేరలేనిదేమీ కాదు!”

  1. పులుల్ని జయించడానికి చాలా పద్ధతులున్నట్టు కనిపిస్తోంది. ఫ్రాన్సిస్ బర్టిల్స్ అనే ఆస్ట్రేలియా దేశపు అన్వేషకుడు, భారతదేశంలో ఉన్న అడవులు తనకు “రకరకాలుగాను, అందంగాను, సురక్షితంగాను” కనిపించినట్టు రాశాడు. ఆయన రక్షాకవచం ‘ఈగల కాయితం’ (ఫ్లై పేపర్). “ప్రతిరోజూ రాత్రి నేను, నా శిబిరానికి చుట్టూ కొన్ని కాయితాలు పరిచి ఉంచేవాణ్ణి; దాంతో నిశ్చింతగా ఉండేవాణ్ణి,” అని వివరించాడు. “దానికి కారణం, మనస్తత్వ సంబంధమయినది. పులి గొప్ప స్వాభిమానంగల జంతువు. అది ఈగల కాయితం దాకా వచ్చేవరకు, చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. తరవాత చల్లగా జారుకుంటుంది. దర్జాగల పులి ఏదీ కూడా, జిగురు కాయితం మీద చతికిలబడ్డ తరవాత మనిషి ఎదుటపడ్డానికి పూనుకోదు!”