ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

693

మేళాలో మీకు బాబాజీ దర్శనభాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు,” అన్నాను.

“నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావనుకోను.” తరవాత గురుదేవులు మౌనం వహించారు, నా ఆలోచనలకు అడ్డురావడం ఇష్టంలేక.

ఆ మర్నాడు నేను కొంతమందిని వెంటబెట్టుకొని అలహాబాదుకు బయలుదేరుతుంటే, గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీయుక్తేశ్వర్‌గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం, గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలక్కుండా ఉండాలని భగవంతుడి ఇచ్ఛ. నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది; నాకు అత్యంత ప్రియమైనవాళ్ళ మరణ సమయాల్లో, దేవుడు దయతలిచి, నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు.[1]

మా బృందమంతా 1936 జనవరి 23 తేదీన కుంభమేళా చేరింది. దాదాపు ఇరవై లక్షలమంది ఉన్న ఆ జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండడమే కాదు, మనసును ఉర్రూతలూగిస్తుంది; ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీదా గాఢతరమైన భగవదాలంబన ప్రాప్తికోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధుసన్యాసుల మీదా అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజసిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులూ నయవంచకులు నిజంగా ఉన్నారు; కాని

  1. మా అమ్మ, అన్నయ్య అనంతుడు, అక్క రమ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది ఇతరులూ చనిపోయినప్పుడు నేను దగ్గర లేను.

    (నాన్నగారు కలకత్తాలో, 1943 లో, ఎనభై తొమ్మిదో ఏట కాలంచేశారు.)