ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

679

సంపదల్ని వేదకాలపు భారతదేశం ఎప్పుడూ ఏవగించుకొంటూ ఉండేది. ఔదార్యంలేని ధనసంపన్నులకు సమాజంలో అధమ శ్రేణే ఇవ్వడం జరిగింది.

అనేక శతాబ్దుల కాలగతిలో కులవ్యవస్థ గిడసబారి వంశానుగతమైన నిర్బంధంగా పరిణమించినప్పుడు, తీవ్రమైన దుష్ఫలితాలు ఉత్పన్నమయాయి. 1947 నుంచి స్వయంపాలన కావించుకొంటున్న భారతదేశం పుట్టుకనుబట్టి కాక, కేవలం సహజమైన అర్హతమీదే ఆధారపడ్డ సనాతన కులమూల్యాల్ని తిరిగి నెలకొల్పడానికి, నెమ్మదిగా నయినా కచ్చితంగా ప్రగతి సాధిస్తోంది. భూమి మీద ప్రతిదేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది; జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని గౌరవప్రదంగా తొలగించవలసి ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞాన్వితమై, సుదృఢమైన ఉత్సాహంగల భారతదేశం, కుల సంస్కరణ భారాన్ని వహించడానికి సమర్థమైనదేనని నిరూపించుకోగలదు.

శ్రీ రైట్, నేనూ ఇంకొంతకాలం ఇక్కడ ఉండాలని ఉవ్విళ్ళూరే టంతగా ఆకట్టుకుంది మమ్మల్ని, దక్షిణ భారతదేశం. కాని కాలం, ఎంతో కాలం నుంచి మొరటుతనం అలవాటు కావడంవల్ల మాకు మర్యాదగా గడువులు పొడిగించడం మానేసింది. త్వరలోనే నేను, కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న, భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి వచ్చింది. మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరగా, ఇండియన్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు అధ్యక్షులైన సర్ సి. వి. రామన్‌తో జరిగిన సంభాషణకు ఆనందించాను. మహా