ఈ పుట అచ్చుదిద్దబడ్డది

676

ఒక యోగి ఆత్మకథ

“పిచ్చెత్తిన ఏనుగును అదుపు చెయ్యవచ్చు నువ్వు;
 ఎలుగుబంటి, పులి నోళ్ళు ముయ్యవచ్చు;
 సవారి చెయ్యవచ్చు సింహంమీద, ఆడించవచ్చు తాచుపామును;
 బతుకు తెరువు, చూసుకోవచ్చు రసవిద్యవల్ల;
 ప్రపంచమంతా తిరగవచ్చు నువ్వు, ఒకరి కంట బడకుండా,
 దేవుళ్ళని బానిసల్ని చేసుకోవచ్చు; నిత్యయవనుడివై ఉండిపోవచ్చు;
 నీటిమీద నడవవచ్చు; నిప్పులో బతకవచ్చు నువ్వు;
 కాని మనస్సును అదుపుచేసుకోడ మన్నదే అన్నిటికన్నా
                మంచిదీ, వాటికన్న మహాకష్టమయిందీను.”

భారతదేశంలో బాగా దక్షిణాన సుందరమయిన, సారవంతమయన తిరువాన్కూరు రాజ్యం ఉంది. అక్కడ రాకపోకలు నదులమీదా కాలవలమీదా సాగుతుంటాయి. వెనక ఎప్పుడో జరిగిన యుద్ధాలవల్లా చిన్నచిన్న జమీల్ని తిరువాన్కూరు రాజ్యంలో కలుపుకోడంవల్లా అంటిన పాపాల పరిహారంకోసం మహారాజు ప్రతి సంవత్సరం వంశానుగతంగా వచ్చే విధిని పాటించటం పరిపాటి. సంవత్సరానికి ఏభై రోజులపాటు మహారాజు, వేదపఠనం వినడానికి ప్రతిరోజూ మూడేసి సార్లు దేవాలయానికి వెళ్తూ ఉంటాడు; లక్ష దీప హారతితో పాపపరిహార తతంగం ముగుస్తుంది.

భారతదేశానికి ఆగ్నేయతీరంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో సమతల ప్రదేశంతో, విశాలంగా, సముద్రాన్ని ఆనుకొని మద్రాసు నగరమూ బంగారు నగరమనే కాంచీపురమూ ఉన్నాయి. ఈ కాంచీపురం క్రీస్తుశకం తొలి శతాబ్దాల్లో పాలించిన పల్లవ వంశరాజులకు రాజధాని.