ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

667

లిపులు,” ఆయన కాలంలో సువ్యాప్తమై ఉన్న అక్షరాస్యతకు సాక్షి భూతాలుగా నిలుస్తాయి. 13 వ శిలాశాసనం యుద్ధాల్ని ఇలా నిరసిస్తుంది. “ధర్మవిజయాన్ని తప్ప మరిదేన్నీ నిజమైన విజయంగా పరిగణించకండి.” రాజు నిజమైన ఘనత, తన ప్రజలు నైతికమైన విలువ సంపాదించడానికి అతను చేసే సహాయం మీదే ఆధారపడి ఉంటుందని 10 శిలాశాసనం ఘోషిస్తుంది. 11 శిలాశాసనం “నిజమైన కానుక”ను నిర్వచిస్తూ, అది వస్తురూపమైనది కాక, సత్యవ్యాపన రూపమైన ‘సత్తు’ అని తెలియజేస్తుంది. ‘దేవానాం ప్రియు’డైన ఆ చక్రవర్తి, 6 శిలాశాసనంలో, ప్రజాహిత కార్యకలాపాల గురించి తనతో ముచ్చటించడానికి, “పగలుకాని, రాత్రికాని, ఏ సమయంలోనైనా సరే” తన దగ్గరికి రావచ్చునని ప్రజల్ని ఆహ్వానిస్తాడు. అంతే కాకుండా, తన రాజోచిత కర్తవ్యాల్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడం వల్ల , “తోటి ప్రజలకు తాను తీర్చుకోవలసిన ఋణం నుంచి విముక్తి పొందుతున్నా” నని కూడా అంటాడు, అందులో.

అశోకుడు అజేయుడైన చంద్రగుప్త మౌర్యుడి మనమడు. ఈ చంద్రగుప్తుడు, అలెగ్జాండరు భారతదేశంలో నిలిపిన సైనిక పటాలాన్ని సర్వనాశనం చేసి, క్రీ. పూ. 305 లో సెల్యుకస్ ఆధిపత్యంలో దండెత్తి వచ్చిన మాసిడోనియా సైన్యాన్ని ఓడించినవాడు. చంద్రగుప్తుడు పాటలీపుత్రం[1]లో మెగస్తనీస్, అనే గ్రీకు రాయబారిని తన ఆస్థానంలో ఆదరిం

  1. పాటలీపుత్ర (ఇప్పటి పాట్నా) నగరానికి ఆకర్షవంతమైన చరిత్ర ఉంది. అది ఎటువంటి ప్రాముఖ్యమూ లేని దుర్గంగా ఉన్న రోజుల్లో, క్రీ. పూ. ఆరో శతాబ్దిలో బుద్ధభగవానుడు దాన్ని సందర్శించాడు. అప్పుడాయన ఇలా జోస్యం పలికాడు. “ఆర్యజనులు సాగినంత దూరం, వర్తకులు ప్రయాణించినంత దూరం, పాటలీపుత్రం అన్ని రకాల సామగ్రి వినిమయానికి కేంద్రంగా, వారికి ముఖ్యనగరం అవుతుంది.” (మహాపరి నిర్వాణ సూత్రం). రెండు, శతాబ్దుల తరవాత పాటలీపుత్రం, చంద్రగుప్త మౌర్యుడి మహాసామ్రాజ్యానికి రాజధాని అయింది. ఆయన మనమడు అశోకుడు, రాజధాని నగరానికి ఇతోధిక సంపన్నత, వైభవం చేకూర్చాడు.