ఈ పుట ఆమోదించబడ్డది

660

ఒక యోగి ఆత్మకథ

ముందు వచ్చే పాఠాల్లో బోధించే క్రియాయోగమనే ఉన్నత విద్యకు అవి అత్యవసర ప్రాతిపదిక ఏర్పరుస్తాయి.

యోగదా విద్యా, మత, ప్రజాహిత కార్యకలాపాలకు అనేకమంది ఉపాధ్యాయులూ కార్యకర్తల సేవాతత్పరతలు అవసరమవుతారు. అలాటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు కనక, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం లేదు; కాని వారిలో ప్రతి ఒక్కరికీ నా హృదయంలో ప్రేమాపూర్ణమైన స్థాన ముంది.

శ్రీ రైట్, రాంచీ కుర్రవాళ్ళతో చాలా స్నేహాలు చేశాడు. సాదా పంచె కట్టుకొని వాళ్ళతోనే కలిసి కొన్నాళ్ళు ఉన్నాడు. బొంబాయి, రాంచీ, కలకత్తా, శ్రీరాంపూర్ - ఎక్కడికి వెళ్ళినా సరే, నా కార్యదర్శి తన సాహస కృత్యాల్ని ప్రయాణం డైరీలో రాస్తూ వస్తాడు; వివరంగా వర్ణించే ప్రతిభ అతనికి ఉంది. ఒకనాడు సాయంత్రం నే నతన్ని ఒక ప్రశ్న అడిగాను.

“డిక్ , భారతదేశాన్ని గురించి నీకు కలిగిన అభిప్రాయం ఏమిటి?”

“శాంతి,” అన్నాడతను సాలోచనగా. “ఈ జాతి తత్త్వం శాంతి.”