ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 4

హిమాలయాలకు పారిపోతుంటే

ఆటంకం

“ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటికి వచ్చెయ్యి. ఒక గుర్రబ్బండి కుదుర్చుకో. మా సందులోకి వచ్చేసి, మా ఇంట్లోవాళ్ళెవరి కంటా పడని చోట ఆగు!”

నాతోబాటు హిమాలయాలకి రావాలనుకున్న మా హైస్కూలు స్నేహితుడు– అమర్ మిత్తర్‌కి నే నిచ్చిన చివరి సూచన లివి. మేము పలాయనానికి నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజు. మా అన్నయ్య అనంతుడు నన్నొక కంట కనిపెడుతూ ఉండటంవల్ల ముందు జాగ్రత్తలు అవసరమయాయి. ఇంటినుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనస్సులో ఉన్నట్టు అనుమానించి, ఎలాగయినా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. రక్షరేకు నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్యదర్శనాల్లో తరచు నాకు కనిపిస్తూండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనని నా ఆశ.

మా నాన్న గారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తరవాత మా కుటుంబం అక్కడే ఉంటోంది. పితృస్వామికమైన భారతీయ ఆచారం ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో మిద్దెమీది ఒక చిన్న గదిలో నేను ప్రతి రోజూ ధ్యానం చేసుకుంటూ నా