ఈ పుట ఆమోదించబడ్డది

640

ఒక యోగి ఆత్మకథ

ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం; ఆమె చిన్న పిల్ల మాదిరిగా మావేపు చెయ్యి ఊపుతూ తొంగిచూసింది.

ఆ మర్నాడు థెరిసా సోదరు లిద్దరితో ముచ్చటించాం. వాళ్ళు చాలా దయగలవాళ్ళూ కలుపుగోలు మనుషులూ. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే, ఆ సాధ్వి రోజుకు ఒకటి రెండు గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటిమీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా, సత్తువగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ; చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణచేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతూంటాయి. ప్రార్థనలకోసం, రోగనివారక ఆశీస్సులకోసం కాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటా రామెకు. ఆమె చలవవల్ల తీవ్రవ్యాధులు నయమయినవాళ్ళు చాలామంది ఉన్నారు.

ప్రార్థనద్వారా, ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి థెరెసాకు ఉందని, ఆమె తమ్ముడు ఫెర్డినాండ్ - సుమారు ఇరవైమూడేళ్ళవాడు, నాకు చెప్పాడు. ఒకసారి, క్రైస్తవమత సంబంధ మైన పారిష్‌లో ఫాదరీగా శిక్షణ పొందడానికి ప్రవేశించబోతున్న యువకు డొకడు, గొంతు జబ్బుతో బాధపడుతూ ఉండడంవల్ల, ఆ జబ్బు తన గొంతుక్కి రావాలని ఆమె ప్రార్థించినప్పటినించి, ఆ సాధ్వి భోజనం మానేసింది.

గురువారం మధ్యాహ్నం మా బృందం, బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరజాల జుట్టువేపు ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే మాకు కావలసిన అనుమతి పత్రం రాసి ఇచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చివాళ్ళు ఈ నియమం పెట్టింది, ఊసుపోకకు వచ్చే పర్యాటకుల తొక్కిస