ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

633

(3) థెరిసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది; కాని దైవప్రసాదంగా ‘పలచని రొట్టె’ ముక్క (వేఫర్ ) మాత్రం మింగుతుంది.

(4) 1926 లో థెరిసా తలమీదా, రొమ్ముమీదా, చేతులమీదా, పాదాలమీదా క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం[1]నాడూ ఆమె, మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ, ‘క్రీస్తువ్యథ’ (Passion of Christ) అనుభవిస్తుంది.

(5) సాధారణంగా, తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన థెరిసా, శుక్రవారం సమాధి స్థితుల్లో పలికే పదబంధాల్నీ, ప్రాచీన అరామయిక్ భాషా రూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె, సముచిత సమయాల్లో హిబ్రూకాని గ్రీకుకాని మాట్లాడుతుంది.

(6) మత ధర్మాధికారుల అనుమతితో థెరిసా చాలాసార్లు నిశితశాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రోటస్టెంట్ జర్మన్ వార్తా

  1. యుద్ధ సంవత్సరాలు మొదలుకొని థెరిసా, ఏడాదిలో కొన్ని పవిత్ర దినాల్లో తప్ప, ఆ ‘వ్యథ’, ప్రతి శుక్రవారం అనుభవించేది కాదు. ఆమె జీవితాన్ని గురించి వచ్చిన పుస్తకాలు ఇవి: ‘థెరిసా నాయ్‌మన్’ : ఎ స్టిగ్మాటిస్ట్ ఆఫ్ అవర్ డే’ (మన కాలపు శతచిహ్నధారిణి: థెరిసా నాయ్‌మన్. ‘ఫర్దర్ క్రానికల్స్ ఆఫ్ థెరిసా నాయ్‌మన్’ (థెరిసా నాయ్‌మన్, తదుపరి వృత్తాంతాలు) - ఈ రెండూ ఫ్రిడ్‌రిక్, రిటర్ వాన్ లామా రాసినవి; ఎ. పి. షింబర్గ్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ థెరిసా నాయ్‌మన్’ (1947): ఇవన్నీ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఉన్న బ్రూస్ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించింది; జొహానెస్ స్టెయినర్ రాసిన ‘థెరిసా నాయ్‌మన్’, అమెరికా, న్యూయార్కులో స్టేటస్ ఐలాండ్‌లోని ఆల్బా హౌస్ ప్రచురించింది.