ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

617

నేను చాలా ఏళ్ళ క్రితం కాశ్మీరులో కలిగిన అంతర్దర్శనంలో చూసినదే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాల్ని తెలిపే ఫోటోలు శ్రీయుక్తేశ్వర్‌గారికి వెంటనే పంపాను. ఒక పోస్టుకార్డు మీద, ఆయన బెంగాలీలో సచూధానం రాశారు; దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను.

11 ఆగస్టు, 1926

నా ప్రియవత్సా, ఓ యోగానందా!

నీ విద్యాలయమూ విద్యార్థులూ, ఉన్న ఫొటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతోందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను.

స్తోత్ర గీతాల్లో, రోగనివారక స్పందనల్లో, రోగనివారక దైవ ప్రార్థనల్లో నీ పద్ధతులగురించి విని, నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను.

బయటి గేటు, వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి, మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్‌కు దిగువున విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే, వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను.

ఇక్కడంతా సజావుగా సాగిపోతోంది. దేవుడి దయవల్ల , నువ్వెప్పుడూ ఆనందంగా ఉందువుగాక!

—శ్రీయుక్తేశ్వర్ గిరి

ఏళ్ళకేళ్ళు చకచకా సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతిచోటా నేను ఉపన్యాసాలిచ్చాను. వందలకొద్దీ క్లబ్బుల్లో, కళాశాలల్లో,