ఈ పుట ఆమోదించబడ్డది

616

ఒక యోగి ఆత్మకథ

“రాంచీ బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద, ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు. ధారాళమైన ఇంగ్లీషులో, పటిష్ఠమైన వచస్సుతో, దార్శనిక స్వభావానికి సంబంధించిన ‘మతశాస్త్రం’ (ది సైన్స్ ఆఫ్ రెలిజియన్) అనే విషయం మీద ఉపన్యాసం ఇచ్చారు; అధికసంఖ్యాకులకు అందించడం కోసం, దీన్ని కరపత్రరూపంలో ముద్రించడం జరిగింది. మత మన్నది విశ్వ జనీనమని అది ఒక్కటేననీ అన్నారాయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని ఆచారాల్నీ మనం విశ్వజనీనం చెయ్యలేకపోవచ్చు; కాని మతంలో ఉన్న సామాన్య తత్త్వాన్ని విశ్వజనీనం చెయ్యవచ్చు; అందరూ దాన్ని సమానంగా అనుసరించి, మన్నించాలని కోరవచ్చు.”

నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కువల్ల, మహాసభ ముగిసిపోయిన తరవాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్‌లో అతిసామాన్య పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగోపన్యాసా లిచ్చాను, తరగతుల్లో బోధించాను. ‘సాంగ్స్ ఆఫ్ ది సోల్’ (ఆత్మగీతాలు) అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి, ‘సిటీ ఆఫ్ న్యూయార్క్ - కళాశాల’ అధ్యక్షులైన ఫ్రెడరిక్ బి. రాబిన్‌సన్ పీఠిక రాశారు.

1924 లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభింస్తూ, అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలాస్కాలో విశ్రాంతిగా గడపడంకోసం సియాటిల్‌లో ఓడ ఎక్కాను.

విశాల హృదయులై న విద్యార్థుల సహాయంతో 1925 లో, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో, మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్‌లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయభవనం,