ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

599

ఆయన పాదాలకు ప్రణామం చేశాను; ఆ పరమగురువులు దయతో నా భుజం తట్టారు.

“ ‘అబ్బాయి, నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి,” అన్నారాయన. ‘నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేక పోయావు నువ్వు. దివ్య వేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగయి ఉన్న వెలుతురులోకి మాయమయ్యారు బాబాజీ.

“నా కడపటి కాశీ సందర్శనల్లో ఇది ఒకటి,” అని ముగించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే, లాహిరీ మహాశయుల గృహస్థ అవతారం ముగింపుకి దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి, వీపుమీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యడానికి ఆయన అడ్డుపెట్టారు; తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపు చేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుపట్టారు; దానికి ఆయన గూఢంగా జవాబు ఇచ్చారు:

“ ‘ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి; మీరు ఏం చెయ్యదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను.’ ”

“కొద్ది కాలంలో, ఆ అసదృశ గురుదేవులు, కాశీలో తనువు చాలించారు. ఆయనకోసం నేనిక ఆయన చిన్న గదికి వెళ్ళక్కరలేదు. నా జీవితంలో ప్రతిరోజూ ఆయన సర్వోపగత మార్గదర్శిత్వంతో ధన్యమవుతోంది.”

చాలా ఏళ్ళ తరవాత, లాహిరీ మహాశయుల నిర్యాణాన్ని గురించి