ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

583

ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోడం ఎలాగో ఆధునిక విజ్ఞానశాస్త్రం మనకి చెబుతుంది కనక, నామరూపాలన్నిటి వెనకా ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోడంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతిపరిచయంవల్ల దాని పరమరహస్యాలగురించి అవజ్ఞ ఏర్పడుతోంది; దాంతో మనకున్న సంబంధం, ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే, అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దానిచేత నిర్భంధంగా పనిచేయించుకోడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తూంటాం; మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం; అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతోంది. విజ్ఞానశాస్త్రంలో, ప్రకృతితో మనకున్న సంబంధం, పొగరుబోతు యజమానికి అతని నౌకరుకూ ఉండే సంబంధం లాంటిది; లేదా, తాత్త్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి, [న్యాయస్థానంలో] సాక్షి బోనులో ఉన్న బందీ లాంటిది. దాన్ని మనం అడ్డుపరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం; మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచలేని, మానవుల తక్కెళ్ళలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తూస్తాం. అలా కాకుండా ఆత్మకు, అంతకన్న పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి, ఎటువంటి బాధకాని మానవ సంకల్పం కాని లేకుండా, దానంతట అది తల వంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైన ఈ అధికారాన్ని, అవగాహన చేసుకోని భౌతికవాది, ‘అలౌకిక ఘటనాత్మకం’ (మిరాక్యులస్) అని అంటాడు.

“లాహిరీ మహాశయుల జీవితం నెలకొల్పిన ఆదర్శం, యోగం ఒకానొక మర్మవిద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది. భౌతికశాస్త్రం యథార్థతాలక్షణం ఉన్నదే అయినా, ప్రతి మనిషి, ప్రకృతితో తనకున్న సరయిన సంబంధాన్ని అర్థంచేసుకోడానికి ప్రకృతి శక్తులన్నిటి పట్లా ఆధ్యాత్మిక పూజ్యతాభావానుభూతి పొందడానికి ఒక