ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

581

చాలామంది మహా ప్రవక్తలలాగే లాహిరీ మహాశయులు కూడా తమకు తాముగా పుస్తకాలేమీ రాయలేదు కానీ, పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించారు. మహాగురువుల మనుమలైన కీ. శే. ఆనందమోహన్ లాహిరీ ఇలా రాశారు:

“భగవద్గీతలోనూ మహాభారత ఇతిహాసంలో ఇతర భాగాల్లోనూ వ్యాసఘట్టాలు (వ్యాసకూటాలు; చిక్కుముడులు) ఉంటుంటాయి. ఈ వ్యాసఘట్టాల్ని ప్రశ్నించకుండా వదిలేస్తే, ఇట్టే అపార్థం చేసుకోడానికి వీలైన చిత్రమైన పురాణ కథలు తప్ప మరేమీ కనిపించవు. ఈ వ్యాస ఘట్టాల్ని వివరించకుండా వదిలేస్తే వేలకొద్దీ సంవత్సరాల ప్రయోగ అన్వేషణ అనంతరం మానవాతీతమైన ఓర్పుతో ప్రాచ్యఖండం పరిరక్షిస్తూ వచ్చిన ఒకానొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్టే లెక్క![1] పవిత్ర గ్రంథాల్లో శబ్దచిత్ర కల్పనాత్మకమైన చిక్కుల్లో

  1. “క్రీ. పూ. మూడువేల ఏళ్ళనాటివని నిర్ణయించదగిన, సింధునదీ లోయలో పురాతత్త్వ పరిశోధన క్షేత్రాల్లో తవ్వి తీసిన, కొన్ని ముద్రికల మీద ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ఆకృతులు కనిపిస్తున్నాయి. ఈనాటికి యోగసాధన విధానంలో వాడుకలో ఉన్న ఈ ముద్రల్నిబట్టి, యోగశాస్త్ర మౌలికాంశాలు కొన్ని ఆనాటికే తెలిసి ఉన్నవని నిష్కర్ష చెయ్యడానికి వీలు కలుగుతోంది. భారత దేశంలో ఐదువేల ఏళ్ళకు పూర్వమే, అధ్యయనానుశీలన పద్ధతుల సహాయంతో సక్రమమైన ఆత్మపరిశీలన సాధనచేసేవారన్న నిర్ణయానికి రావడం హేతురహితం కాకపోవచ్చు.”- ప్రొఫెసర్ డబ్ల్యు. నార్మన్ బ్రౌన్, అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ లెర్నెడ్ సొసైటీస్, వాషింగ్టన్, డి. సి., వారి బులెటిన్‌లో,

    అయితే, హిందూ పవిత్ర గ్రంథాలు చూపించే ప్రమాణం, యోగశాస్త్రం, భారతదేశంలో చెప్పనలవి కానన్ని వేల సంవత్సరాల నుంచి వర్ధిల్లుతూ ఉందని.