ఈ పుట ఆమోదించబడ్డది

580

ఒక యోగి ఆత్మకథ

పట్టి ఇమ్మని, గురుదేవులు ఏ శిష్యుణ్ణయినా కోరినట్లయితే, ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు. అదే మరొకరెవరయినా ప్రయత్నిస్తే, చిత్రమైన ఇబ్బందులు ఎదురయేవి; అవసరమైన ప్రక్రియల్లో నూనె బట్టీపట్టడం అయిన తరవాత చూస్తే, ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరయిపోయి ఉండేది. గురుదేవుల ఆశీస్సు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమవుతోంది.

లాహిరీ మహాశయుల చేతిరాత, ఆయన సంతకం, బెంగాలీ లిపిలో, పైన చూడవచ్చు. పై పంక్తులు, ఒక శిష్యుడికి రాసిన ఉత్తరంలోవి; మహాగురువులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఇలా అన్వయించారు: “కనురెప్పలు అల్లాడనంతటి ప్రశాంతస్థితి నందుకున్న వాడు ‘శాంభవీ ముద్ర’ సిద్ధింపజేసుకున్నవాడు.”[1]

(సంతకం) "శ్రీ శ్యామాచరణ్ దేవ శర్మన్"

  1. శాంభవీముద్ర అంటే, భ్రూమధ్యంలో చూపు నిలిపి ఉంచడం. యోగి, ఒకానొక ప్రశాంత మానసిక స్థితికి చేరుకున్నప్పుడు, అతని కనురెప్పలు కదలవు; అంతర్లోకంలో లీనుడై ఉంటాడు.

    ముద్ర (“చిహ్నం”) అనేది మామూలుగా, వేళ్ళతోనూ చేతులతోనూ చేసే, ధార్మికాచారపరమైన ఒక చేష్టను సూచిస్తుంది. చాలా ముద్రలు నిశ్చితమైన నరాలమీద పనిచేసి ప్రశాంతత అలవరుస్తాయి. సనాతన హిందూ శాస్త్రగ్రంథాలు నాడుల్నీ (శరీరంలో 71,000 నాడీమార్గాలు), మనస్సుతో వాటికిగల సంబంధాల్నీ సునిశితంగా వర్గీకరించాయి. అర్చనలోనూ యోగసాధనలోనూ ఉపయుక్తమయిన నరాలకు, ఈ విధంగా శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉంది. విగ్రహ శిల్ప శాస్త్రంలోనూ ధార్మికాచారపరమైన భారతీయ నాట్యాల్లోనూ ఈ ముద్రలకు విస్తృతమైన భాష ఒకటి కనిపిస్తుంది.