ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

575

ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు. లాహిరీ మహాశయులు, భూపేంద్రునికి కలలో కనిపించి, దీక్ష ఇచ్చారు. తరవాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మన్నారు. “నీ కిదివరకే దీక్ష ఇచ్చాను, కలలో,” అని జవాబిచ్చారు లాహిరీ మహాశయులు.

శిష్యు డెవరయినా తన లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా, గురుదేవులు మెల్లగా అతన్ని చక్కదిద్దేవారు.

“శిష్యుడి లోపాలగురించి పదిమందిలో చెప్పక తప్పనప్పుడు కూడా, లాహిరీ మహాశయుల మాటలు సౌమ్యంగా, నయంచేసేలా ఉంటాయి,” అని ఒకసారి చెప్పారు నాకు, శ్రీయుక్తేశ్వర్‌గారు. తరవాత విచారంగా ఇంకా ఇలా అన్నారు. “మా గురువుగారి బాణం మొనల్ని తప్పించుకోడానికి ఎన్నడూ ఏ శిష్యుడూ పారిపోలేదు.” నేను నవ్వు ఆపుకోలేకపోయాను; వాడిగా ఉన్నా ఉండకపోయినా, నా గురుదేవుల ప్రతి మాటా నా చెవులకు సంగీతం లాంటిదని సత్యప్రమాణంగా వారికి నచ్చజెప్పాను.

లాహిరీ మహాశయులు క్రియాయోగాన్ని జాగ్రత్తగా నాలుగు క్రమోన్నత దీక్షలుగా విభజించారు.[1] సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తరవాతే పై మూడు ప్రక్రియలూ ఉపదేశించేవారు: ఒకనాడొక శిష్యుడు, గురువుగారు తన విలువను సరిగా అంచనా వెయ్యడం లేదని గట్టి నమ్మకం ఏర్పరచుకొని, తన అసంతృప్తి వెల్లడించాడు.


  1. క్రియాయోగంలో శాఖోపశాఖలు చాలా ఉన్నాయి. లాహిరీ మహశయులు వాటిని పరిశీలించి నాలుగు ప్రక్రియల్ని- సాధనపరమైన అత్యధిక విలువ కలవాటిని ఎంపిక చేశారు.