ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

569

మయింది. పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు; అలాగే, ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు, సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు, ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ, భారతదేశంలో ప్రతిభాగం నుంచి రావడం మొదలు పెట్టాయి.

లాహిరీ మహాశయుల్ని “ఎక్‌స్టాటిక్ బాబూ” (ఆనందమగ్నుడు) అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీషు ఆఫీసు సూపరింటెండెంటు, ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగా గమనించాడు.

“అయ్యా, మీరు దిగులుగా కనిపిస్తున్నారు. ఏమిటి ఇబ్బంది?” లాహిరీ మహాశయులు ఒకనాడు పొద్దున తమ యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది.

“ఇంగ్లండులో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది. నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను.”

“ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను,” అని లాహిరీ మహాశయులు, ఆయన గదిలోంచి వచ్చేశారు; ఒక ఏకాంత ప్రదేశంలో కొంత సేపు కూర్చున్నారు. తిరిగి వస్తూ, ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు.

“మీ ఆవిడ మెరుగవుతున్నారు, ఇప్పుడు మీ కో ఉత్తరం రాస్తున్నారు.” సర్వజ్ఞులైన ఆ యోగిపుంగవులు, ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదాహరించారు.

‘ఎక్‌స్టాటిక్ బాబూ, మీరు సామాన్య వ్యక్తి కారని నాకు ముందే