ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

555

బంధాలతో, భారమైన లౌకిక విధులతో చిక్కులుపడుతున్న లక్షలాది జనం, తమలాగే సంసారివైన నీ నుంచి కొత్త ఆశ పొందుతారు. అత్యున్నతమైన యోగ ఉపలబ్ధులు సంసారికి అందరానివి కావని వాళ్ళు గ్రహించడానికి నువ్వు దారి చూపించాలి. ప్రపంచంలో కూడా, వ్యక్తిగత ప్రయోజనోద్దేశం కాని అనుబంధం కాని లేకుండా తన బాధ్యతల్ని నిష్ఠగా నిర్వహించే యోగి, నిశ్చయమైన జ్ఞానమార్గాన్ని అనుసరిస్తాడు.”

“ ‘ప్రపంచాన్ని విడవాలని నిన్ను నిర్బంధించే అవసరం ఏదీ లేదు; ఎంచేతంటే లోపల్లోపల నువ్వు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క బంధాన్నీ పూర్వమే తెంపేశావు. నీ కుటుంబానికి, ఉద్యోగానికి, పౌరజీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన విధుల్ని నువ్వు అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడానికి నీ కింకా చాలా ఏళ్ళ వయస్సు ఉంది. దైవపరమయిన ఆశ అనే మధురమయిన కొత్త ఊపిరి సంసారుల శుష్క హృదయాల్లోకి చొరబడుతుంది. నీ సంతులిత జీవనం నుంచి వాళ్ళు, మోక్ష మన్నది అంతస్సన్యాసం మీదే కాని బాహ్యసన్యాసం మీద ఆధారపడ్డది కాదని అర్థం చేసుకుంటారు.’ ”

“ఉన్నతమైన ఆ హిమాలయ ఏకాంత ప్రదేశాల్లో మా గురుదేవుల వాక్కులు వింటూ ఉంటే నా కుటుంబమూ, ఆఫీసూ, ప్రపంచమూ ఎంత దూరమో అనిపించింది. అయినా ఆయన వాక్కుల్లో కఠోర సత్యం ధ్వనించింది; పావనమైన ఈ శాంతి ధామాన్ని విడిచి వెళ్ళడానికి అణకువగా అంగీకరించాను. యోగవిద్యను గురువునుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు.

“ ‘యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు,’ అన్నారు బాబాజీ. “దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ