ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ

531

కనిపిస్తుందంటే కడపటి ఏళ్ళలో లాహిరీ మహాశయులు, యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చెలామణి కాగలిగేటట్టు ఉండేవారు.

ఋషితుల్యులయిన నా సంస్కృతభాషాధ్యాపకులు స్వామి కేవలానందగారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు.

“సాటిలేని ఈ పరమ గురువులు, తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోటినుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు,” అన్నారు కేవలానందగారు నాతో. “ఆయనతో బాటు ఉండే చిన్న బృందంలో, ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు. ఒక ప్రదేశంలో కొంత కాలమున్నాక బాబాజీ, ‘డేరా డండా ఉఠావో’ (‘ఇంక బిచాణా ఎత్తేద్దాం’) అంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక ‘దండం’ (వెదురు కర్ర ) ఉంటుంది. ఆయన మాటలు, తమ బృందం తక్షణమే మరో చోటికి మారడానికి సూచన. ఆయన ప్రతి మాటూ సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు; ఒక్కొక్కప్పుడు ఒక కొండ మీంచి మరో కొండ కొమ్ము మీదికీ కాలినడకనే వెళ్తూంటారు.

“బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్లు ఆయన్ని గుర్తుపట్టడం కాని జరుగుతుంది. వేరువేరు భక్తులకు ఆయన, కొద్దిపాటి తేడాగల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు. ఒక్కొక్కప్పుడు గడ్డం, మీసాలతో; మరొకప్పుడు అవి లేకుండా, చ్యుతిలేని ఆయన దేహానికి ఆహార మక్కర్లేదు; అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యులపట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన, అప్పుడప్పుడు పళ్ళో, పాలూ నెయ్యీ పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు.

“బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమయిన సంఘటనలు రెండు