ఈ పుట ఆమోదించబడ్డది

522

ఒక యోగి ఆత్మకథ

శ్యామాచరణ్ లాహిరీగారికి 1846లో శ్రీమతి కాశీమణితో వివాహమయింది. ఈవిడ దేవ్ నారాయణ్ సన్యాల్‌గారి కూతురు. ఆదర్శ భారత గృహిణి కాశీమణిగారు, తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించడం, బీదవాళ్ళకి సేవ చెయ్యడం వంటి గృహస్థ ధర్మాలు నిర్వహించేవారు. వీరి దాంపత్యఫలాలుగా సౌమ్య మూర్తులయిన ఇద్దరు కొడుకులూ-- తిన్‌కౌడీ, దుకౌడీ - ఇద్దరు కూతుళ్ళూ పుట్టారు. ఇరవై మూడో ఏట, 1851 లో, లాహిరీ మహాశయులు బ్రిటిష్ గవర్నమెంటువారి మిలిటరీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటులో ఎకౌంటెంట్ పోస్టు చేబట్టారు. ఉద్యోగకాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు. ఈ ప్రకారంగా ఆయన, భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావడమే కాకుండా, ప్రపంచంలో ఒక ఆఫీసు ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులయారు.

ఆ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటు వారు లాహిరీ మహాశయుల్ని వివిధ సమయాల్లో, గాజీపూర్, మీర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు. తండ్రిగారు చనిపోయిన తరవాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత వహించారు. వాళ్ళకోసం ఆయన, కాశీకి సమీపంలో, వేరుపాటుగా ఉన్న గరుడేశ్వర్ మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు.

తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహిరీ మహాశయులు చూసింది, ముప్పైమూడో ఏట. హిమాలయాల్లో రాణిఖేత్ సమీపంలో తమ మహాగురువులు - బాబాజీని కలుసుకొని, వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు.

ఈ శుభ సంఘటన జరిగింది. లాహిరీ మహాశయుల కొక్కరికే కాదు; మానవజాతి కంతకీ సౌభాగ్య సమయమది. వాడుకలో లోపించి