ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

519

బైబిలులోని ఒక కథలో అబ్రహాం, ప్రభువును[1] ప్రార్థిస్తూ, సోడోమ్ నగరంలో పదిమంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చెయ్యకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు. దానికి సమాధానంగా ప్రభువు “ఆ పదిమంది గురించి నేను దాన్ని నాశనం చెయ్యను,” అన్నాడు. ఈ కథకు, భారతదేశం కాలగర్భంలో కలిసి విస్మృతమైపోకుండా తప్పించుకోడాన్నిబట్టి, కొత్త అర్థం వస్తుంది. యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి, ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, రోముల బలిష్ఠ సామ్రాజ్యాలు గతించిపోయాయి.

దేశం బతికేది తన భౌతిక ఉపలబ్ధులవల్ల కాక, అక్కడి మహా పురుషులవల్లనే నన్న సంగతి ప్రభువిచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది.

అర్ధభాగం ముగియకముందే రెండుసార్లు రక్తరంజితమైన ఈ ఇరవయ్యో శతాబ్దంలో ఆ దివ్యవాక్కులు మళ్ళీ వినిపించుగాక: లంచానికి లోబడని న్యాయమూర్తి - ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళనిపించుకోదగ్గ పదిమందిని కన్న ఏ దేశమూ నశింపు ఎరగదు.

అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం, కాలం కౌటిల్యాల్ని అనేకం ఎదుర్కోడంలో తానేమీ తెలివితక్కువది కాదని నిరూపించుకుంది. ఆత్మసాక్షాత్కారసిద్ధి పొందిన ప్రతిదేశపు మహానుభావులూ ఇక్కడి నేలను పావనం చేశారు. లాహిరీ మహాశయులు, శ్రీయుక్తేశ్వర్‌గారి వంటి ఆధునిక ఋషీశ్వరులు, మానవుడి సుఖానికీ దేశం దీర్ఘాయుష్యానికి ఆత్మసాక్షాత్కార సాధక శాస్త్రమయిన యోగవిద్యాపరిజ్ఞానం ప్రాణావశ్యకమైనదని ఎలుగెత్తి చాటుతారు.

  1. జెనిసిన్ 18 : 23-32.