ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

515

కూడా గురువుగారింటికి నడిచిరావడానికి తగినంత బలంగా ఉండడం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అక్కడతను, కృతజ్ఞతా పూర్వకంగా కన్నీళ్ళు విడుస్తూ, లాహిరీ మహాశయుల ముందు సాగిల బడ్డాడు.

“గురువుగారు ఉల్లాసంతో తన్మయులయారు. ఆయన కళ్ళు నావేపు కొంటెగా చూస్తూ మిలమిల మెరిశాయి.

“ ‘యుక్తేశ్వర్, ఇకనుంచి నువ్వు ఎక్కడికెళ్ళినా, ఓ ఆముదం సీసా తప్పకుండా తీసుకువెళ్ళడం మానవుగదా! నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసెయ్యి. ఏడు చుక్కల ఆ దీపం చమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చెయ్యవలసిందే!’ ”

“ ‘గురూజీ, నన్ను వేళాకోళం చేస్తున్నారు. నా కర్థం కావడం లేదు; నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి.’ ”

“ ‘రాముడు బాగవుతాడని నేను నీకు రెండుసార్లు చెప్పాను; అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు,’ అని విప్పి చెప్పారు లాహిరీ మహాశయులు. ‘డాక్టర్లు ఆతనికి నయం చెయ్యగలుగుతారని నా ఉద్దేశం కాదు. వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది. నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు; వాళ్ళుకూడా బతకాలి కదా మరి.’ ఆనందం ప్రతిధ్వనించే స్వరంలో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు, ‘ఎప్పటికీ ఇది తెలుసుకో; డాక్టరు ఉండుగాక, లేకపోవుగాక, సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికయినా నయం చెయ్యగలడు.’ ”

“ ‘నా పొరపాటు తెలిసి వచ్చిందండి,’ అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను. ‘మీ రనె చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది.’ ”