ఈ పుట ఆమోదించబడ్డది

514

ఒక యోగి ఆత్మకథ

తెల్ల వారగట్ల లాహిరీ మహాశయులు ఓదార్పుగా నావేపు చూశారు. ‘నువ్వింకా ఆందోళనగానే ఉన్నట్టు చూస్తున్నాను. రాముడికి ఏదో ఒక మందురూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదూ?’ అంటూ గురువుగారు, ముడి ఆముదం పోసిఉన్న దీపం ప్రమిదెవేపు చూపించారు. ‘ఆ ప్రమిదెలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో; ఏడు చుక్కలు రాముడి నోట్లో వెయ్యి.’ ”

“ ‘గురుదేవా! అతను నిన్న మధ్యాహ్నమనగా చచ్చిపోయాడు. ఇప్పుడీ చమురు తీసికెళ్ళి లాభమేమిటి?’ అంటూ అభ్యంతరం చెప్పాను.”

“ ‘పరవాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి,’ మా గురువుగారి ఉల్లాసం నాకు అర్థంకాకుండా ఉంది. అప్పటికింకా నేను, సంతాపంనుంచి తేరుకోలేదు. కొంచెం చమురు పోసుకుని రాముడి బసకు వెళ్ళాను.”

“నా స్నేహితుడి శరీరం మృత్యువు పిడికిలిలో, బిర్రబిగిసి ఉండడం చూశాను. అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా, నా కుడి చేతి చూపుడు వేలితో అతని పెదవులు తెరిచి, ఎడం చేత్తో ఒక బిరడా తీసుకుని గిట్టగరుచుకున్న పళ్ళమీద ఒక్కొక్క చుక్కే చమురు వేశాను. చల్లటి పెదవులకు ఏడో చుక్క తగిలేసరికి, రాముడు గజగజా వణికి పోయాడు. అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ళనుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి.

“ ‘ఒక ప్రచండ కాంతిలో లాహిరీ మహాశయుల్ని చూశాను,’ అని అరిచాడతను. ‘ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నారు. “లే, నీ నిద్ర కట్టిపెట్టు, అని నన్ను ఆజ్ఞాపించారు.” యుక్తేశ్వర్‌తో బాటు వచ్చి నన్ను కలుసుకో.”

“రాముడు బట్టలు కట్టుకోడం, ప్రాణం తీసిన జబ్బు తరవాత