ఈ పుట ఆమోదించబడ్డది

494

ఒక యోగి ఆత్మకథ

పూటనుంచి మీరు నాకు భర్త కారు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలిని మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా?”[1]

“గురుదేవులు నన్ను మృదువుగా స్పృశించారు. పవిత్రాత్మా, లే! నిన్ను స్వీకరించడమైంది.’ వారు దేవదూతలవేపు చూపించారు. ‘ఈ పావన సాధుపుంగవు లొక్కొక్కరికే ప్రణామం చెయ్యి.’

“నేను ప్రణామాంజలులు అర్పించడం పూర్తి అయిన తరవాత, ఆ దేవదూతల కంఠస్వరాలన్నీ కలిసి సామవేదగానంలా ధ్వనించాయి.

“ ‘దివ్యపురుష సహధర్మచారిణీ, నువ్వు ధన్యజీవివి. నీ కివే మా నమస్సులు’ అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కాని ఆశ్చర్యం! వారి తేజోరూపాలు చటుక్కున మాయమయాయి. గది చీకటి అయిపోయింది.

“గురుదేవులు నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు.”

“ ‘తప్పకుండా. ఆ అదృష్టం ఇంతదాకా పొందకపోయినందుకు విచారిస్తున్నాను.’ ”

“ ‘అప్పటి కింకా కాలం పరిపక్వం కాలేదు,’ అంటూ లాహిరీ మహాశయులు, ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. ‘నీ కర్మను నువ్వు చాలా మట్టుకు నశింపజేసుకోడానికి నేను గోప్యంగా సాయపడ్డాను. నువ్విప్పుడు సుముఖంగా, సిద్ధంగా ఉన్నావు’

“వారు నా నుదుటిని తాకారు. సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి; ఆ వెలుతురు క్రమక్రమంగా నీలోపల వర్ణంగల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది; దాని చుట్టూ బంగారు కడియం, మధ్యలో తెల్లటి ఐదు మొనల నక్షత్రం ఏర్పడ్డాయి.

  1. “అతడు దేవుడి కోసమే, ఆమె అతనిలోని దేవుడికోసమే.’ ” – మిల్టన్