ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

481

స్తాడు. అతని దృష్టిలో, జలకల్పన కారకమైన కాంతి కిరణాలకీ భూకల్పన కారకమైన కాంతి కిరణాలకీ భేదం ఉండదు. పదార్థ స్పృహనుంచీ, దేశం (స్పేస్) తాలూకు మూడు పరిమాణాల నుంచీ నాలుగో పరిమాణమైన కాలం నుంచీ విముక్తుడైన యోగి తన కాంతిరూప దేహాన్ని, భూమి, నీరు, అగ్ని, వాయువుల కాంతి కిరణాలమీదగా గాని, వాటిగుండా గాని సమాన సౌలభ్యంతో మరో చోటికి బదిలీ చేస్తాడు.

“కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే, నీ దేహమంతా ‘కాంతితో నిండి’ ఉంటుంది”[1] ముక్తిప్రదమైన దివ్యచక్షువుమీద దీర్ఘకాలం నిలిపిన ఏకాగ్రత, పదార్థానికీ దాని గురుత్వాకర్షణ భారానికి సంబంధించిన భ్రాంతులన్నిటినీ, యోగి నశింపజేసేటట్లు చేసింది. విశ్వాన్ని అతను, ఈశ్వరుడు సృష్టించినట్టే మూలతః అభేదమైన కాంతిపుంజంలాగే- చూస్తాడు.

“దృశాబింబాలు (ఆప్టికల్ ఇమేజెస్), మామూలు హాఫ్‌టోన్ (అర్ధబిందు) చికిలిపని చిత్రాలు రూపొందే సూత్రం మీద ఏర్పడతాయి; అంటే, కంటికి కనిపించనంత చాలా చిన్నచిన్న చుక్కలతో ఏర్పడతాయి. .. నేత్రపటలం (రెటీనా) సూక్ష్మగ్రాహ్యత ఎంత గొప్పదంటే, సరైన తీరు కాంతిని అతిస్వల్ప పరిమాణాల్లో ఉపయోగించుకుని దర్శన సంవేదనను కలిగిస్తుంది.” అంటాడు, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే డా॥ ఎల్. టి. ట్రోలాండ్.

సృష్టి సారాన్ని కాంతిగా అనుభూతం చేసుకున్న ఏ వ్యక్తికయినా సరే అలౌకిక ఘటనల నియమం పనిచేస్తుంది. సర్వవ్యాపక కాంతి అణువుల్ని ఇంద్రియగోచర రూపంగా తక్షణమే ప్రక్షేపించడానికి యోగి,

  1. మత్తయి 6-23.