ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

29

కంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరీ మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్నవాళ్ళు నాకు దారి ఇచ్చారు; పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరీ మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా, నీ నుదుటిమీద చెయ్యి పెట్టారు.

“చిట్టి తల్లీ , నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు.”

“సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించి నందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు, వారు నాకు చెప్పారు. నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావని.”

“తరవాత, నీకు ఒక మహాతేజస్సు కనిపించిన సంగతి నాకూ. మీ అక్క - రమకీ తెలుసు బాబూ! నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండడం, పక్కగదిలోంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం ధగధగా వెలిగింది; నీ గొంతులో, భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది.”

“నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటివల్ల తెలుసుకున్నాను. నాయనా! నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్న విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢి చేసింది. ఆ సంఘటనే, ఈ అంతిమ సమయంలో నేనీ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది.

“అదేమిటంటే, పంజాబులో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మన మందరం లాహోరులో ఉంటుండే రోజుల్లో, ఒకనాడు పొద్దున, పని