ఈ పుట ఆమోదించబడ్డది

460

ఒక యోగి ఆత్మకథ

“ఔనండి, నిజమే.” నేను సాంప్రదాయికమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసినని గమనించి ఆయన మర్యాదగా, “మా సంగతులు మీకు ఎలా తెలిశాయో దయచేసి చెబుతారా?” అని అడిగారు.

కాశీని గురించీ, నే నిచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై, నా వృత్తాంతం నమ్మాడు.

“పసిమి చాయగల అబ్బాయి పుడతాడు మీకు,” అని చెప్పాను. అతని ముఖం వెడల్పుగా ఉంటుంది, నుదుటికి పైన ఒక సుడి ఉంటుంది. అతని ప్రవృత్తి ఆధ్యాత్మికతవేపు మొగ్గి ఉంటుంది,” అని చెప్పాను. పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది.

తరవాత పసివాణ్ణి చూడ్డానికి వెళ్ళాను. అతనికి ‘కాశీ’ అన్న పాత