ఈ పుట ఆమోదించబడ్డది

448

ఒక యోగి ఆత్మకథ

ప్రణవానందగారు నన్ను మా నాన్నగారి ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు సిగ్గువేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, “బనత్, బనత్, బన్‌జాయ్”[1] అంటూ మన గురుదేవులు ఎంత తరచుగా అంటూండేవారో గుర్తుచేసుకోండి. కనక, క్రియాయోగసాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్యసన్నిధికి చేరండి.”

నేను మొదటసారి కాశీ వెళ్ళి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా, బలంగా కనిపించిన ప్రణవానందగారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనబడుతోంది. అయితే ఆయన, ఆసనం వేసుకొని కూర్చున్నప్పుడు మాత్రం వెనుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటున్నది.

నేను సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఇలా, అడిగాను; “స్వామీజీ, వయస్సు పైబడుతున్నట్టు మీకు అనిపిస్తోందో లేదో చెప్పండి? శరీరం నీరసపడుతూంటే మీ ఈశ్వరానుభూతుల్లో ఏమయినా తగ్గుదల కనిపిస్తోందా?”

ఆయన చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. “ఆ పరమ ప్రియతముడు, వెనకటికన్న ఇప్పుడే నాకు బాగా చేరువ అయాడు.” ఆయన పరిపూర్ణ విశ్వాసం నా మనస్సునూ ఆత్మనూ ముంచెత్తివేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు: “నే నిప్పటికీ రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను - ఒకటి, ఇక్కడున్న భగవతిగారి ద్వారా వచ్చింది; రెండోది పై నుంచి వచ్చింది.” ఆకాశంవేపు వేలు చూపిస్తూ ఆ సాధువు, కొద్దిసేపు ఆనంద

  1. లాహిరీ మహాశయులకు ప్రియమైన వ్యాఖ్యల్లో ఇది ఒకటి; తమ శిష్యుల్ని, ధ్యానంలో పట్టుదలతో కృషిచెయ్యమని ప్రోత్సహించడానికి ఆయన ఇలా అంటూండేవారు. దీని అర్థం ఏమిటంటే: “చేస్తూ, చేస్తూ, పూర్తి చెయ్యాలి.” దీని భావం తీసుకొని ఇలా స్వేచ్ఛానువాదం చేసుకోవచ్చు; "శ్రమిస్తూ, శ్రమిస్తూ, ఒకనాటికి దివ్యలక్ష్యాన్ని దర్శించు!”