ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

441

ప్రాథమిక, ఉన్నత పాఠశాల తరగతులు రెంటికీ నే నొక కార్యక్రమం ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలూ ఇతర విద్యావిషయాలు కూడా చేర్చడం జరిగింది. ఋషుల విద్యాబోధనాశయాల్ని అనుసరించి, తరగతి బోధన చాలావరకు ఆరు బయటే జరిగే ఏర్పాటు చేశాను (ఋషుల వన్యాశ్రమాలు, భారతీయ బాలకులకు లౌకిక, ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు).

రాంచీ విద్యార్థులకు ధ్యానయోగ పద్ధతీ, ఆరోగ్యానికీ శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ “యోగదా” విధానమూ నేర్పడం జరుగుతోంది; ఈ యోగదా అభ్యాసాల నియమాల్ని నేను 1916 లో కనిపెట్టాను.

మనిషి శరీరం విద్యుద్ఘటం (ఎలక్ట్రిక్ బ్యాటరీ) లాంటిదని గ్రహించి నేను, మానవ సంకల్పమనే ప్రత్యక్ష సాధనం ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చునని తార్కికంగా వివేచించాను, సంకల్పించడమన్నది లేకుండా ఏ రకమైన చర్యా సాధ్యం కాదు కనక, మానవుడు, భారమైన ఉపకరణంతోకాని యాంత్రికమైన వ్యాయామాభ్యాసాలతోకాని కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోడానికి మూలచాలకమైన సంకల్ప శక్తిని వినియోగించుకోవచ్చు. తేలికయిన “యోగదా” పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయే విశ్వశక్తితో తమలో (మెడుల్లా అబ్లాంగేటాలో కేంద్రీకరించి) ఉన్న ప్రాణశక్తిని సంకల్పపూర్వకంగా, తక్షణమే నింపుకోవచ్చు.

రాంచీలో విద్యార్థులు “యోగదా" శిక్షణకు చక్కగా సుముఖత


రాంచీలో ఉన్న యోగదా సత్సంగ విద్యాలయాన్ని గురించి మరికొంత సమాచారం 40 అధ్యాయంలో ఇవ్వడం జరిగింది,