ఈ పుట ఆమోదించబడ్డది

428

ఒక యోగి ఆత్మకథ

భావనగా- అంటే మనస్సు చేసే ఒక పనిగా- ఒక స్వప్నశ్వాసగా గుర్తుపట్టగలుగుతారు.

మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి అతని చైతన్య స్థితులలోని వేరువేరు మార్పులకూ గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక కారణాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన, బుద్ధిప్రచోదకమైన తార్కికవాదాన్ని ఆలకిస్తూ ఉండడం, అతిసున్నితమైన లేదా అతికఠినమైన అంగవిన్యాసం చేస్తూ ఉండడంవంటి సందర్భాల్లో తన మనస్సును పూర్తిగా ఒకదాని మీద లగ్నంచేసిఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు; ఇది దానంతట అది జరుగుతుంది. మనోలగ్నత మందశ్వాస మీద ఆధారపడి ఉంటుంది; భయం, కామం, క్రోధం అనే హానికరమైన భావావేశస్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలూ విషమ శ్వాసలు. మనిషి సగటున నిమిషానికి 18 సార్ల చొప్పున ఊపిరి తీసుకుంటే, మనశ్చాంచల్యం గల కోతి 32 సార్ల చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాంబేలు, పామువంటి జీవుల శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్న తక్కువ. మాటవరసకు, మూడువందల ఏళ్ళవరకు బతికే అవకాశమున్న రాకాసి తాంబేలు నిముషానికి 4 సార్లే శ్వాసిస్తుంది.

నిద్రవల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాలకు కారణం, మనిషికి తన ఒంటిమీదా ఊపిరిమీదా తాత్కాలికంగా స్పృహ లేకపోవడమే. నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి మరింత మెల్లగానూ సమంగానూ సాగుతూ ఉంటుంది. నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు; ప్రతి రాత్రీ అతను, శారీరక స్పృహనుంచి తనను తాను విడుదలచేసుకుని, తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ వెనుబాము కేంద్రాలనే ఆరు ఉపశక్తిజనక స్థానా (సబ్ డైనమో) లలోనూ ఉన్న ఉపశమకారక ప్రవాహాల్లో లీనం