ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

421

చేసి, ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు."[1] దీని తాత్పర్య మేమిటంటే; “యోగి, ఊపిరితిత్తులూ గుండే చేసే పనిని నెమ్మదిచేసి, దానిద్వారా అదనంగా ప్రాణం (ప్రాణశక్తి) సరఫరా అయేటట్టు చేసుకుని, శరీరంలో తరుగుదలను (జీవకణ క్షయాన్ని) అరికడతాడు; అంతే కాకుండా అతడు, అపానాన్ని (విసర్జక ప్రవాహం) అదుపు చేసుకోడంవల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు; ఈ ప్రకారంగా, తరుగుదలనూ పెరుగుదలను నిలుపుచేసి, యోగి, ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోడం నేర్చుకుంటాడు.”

గీతలో మరో శ్లోకం ఇలా చెబుతోంది: “కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడంవల్లా, ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ (ఆడే) ప్రాణ, అపాన వాయువుల సమప్రవాహాల్ని తటస్థీకరించడంవల్లా సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి (ముని) బాహ్య విషయాలనుంచి వెనక్కి తగ్గగలుగుతాడు; మనస్సునూ బుద్ధినీ అదుపు చెయ్యగలుగుతాడు. కోరికనూ భయాన్నీ కోపాన్నీ పారదోలగలుగుతాడు; శాశ్వతంగా విముక్తుడవుతాడు.”[2]

నాశరహితమైన ఈ యోగాన్ని, వెనకటి ఒక అవతారంలో, ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి ఉపదేశించినవాణ్ణి నేనే ననీ, ఆ వివ

  1. అపానే జుహ్వతి ప్రాణః ప్రాణే౽పానం రథాపరే
    ప్రాణాపానగతీ రుద్ద్వా ప్రాణాయామ పరాయణాః
                                                            భగవద్గీత 4 : 9

  2. స్పర్శాన్‌కృత్వా బహిర్సాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువో!
    ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతర చారిణౌ

    యతేంద్రియ మనోబుద్ధి ర్మునిర్మోక్షపరాయణః
    విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః.
                                               అందులోనే 5 : 27-28.