ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 26

క్రియాయోగశాస్త్రం

ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం, మా గురుదేవులకు గురువులయిన లాహిరీ మహాశయుల ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా పదిమందికీ తెలియవచ్చింది. క్రియా శబ్దానికి సంస్కృత మూలధాతువు ‘కృ’ : అంటే, చెయ్యడం, ప్రతిస్పందించడం అని అర్థం. కార్యకారణాల ప్రకృతినియమమైన ‘కర్మ’ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా, క్రియాయోగం “ఒకానొక చర్యద్వారా, లేదా కాండ (క్రియ) ద్వారా పరమాత్మతో పొందే కలయిక (సంయోగం)” అవుతుంది. ఈ ప్రక్రియను నిష్ఠగా సాధనచేసే యోగి, కర్మనుంచి అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖలం నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు.

యోగసంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా, జన బాహుళ్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇయ్యగూడదు నేను. అసలయిన యోగప్రక్రియను, “యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్” వారి దగ్గర అధికారం పొందిన క్రియావంతుడి (క్రియాయోగి) దగ్గరే నేర్చుకోవాలి. ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన చాలు.

క్రియాయోగమన్నది, మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్ [ప్రాణవాయువు/ఆమ్లజని] తో నింపే ఒకానొక