ఈ పుట ఆమోదించబడ్డది

414

ఒక యోగి ఆత్మకథ

ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని, భోజనంలో చేపలూ మాంసమూ గుడ్లూ మానెయ్యమన్నాను.

నళిని నేను పెట్టిన నిషేధాలన్నీ కచ్చితంగా పాటిస్తూ, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా, కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తరవాత నేనోసారి చూడ్డానికి వెళ్ళాను.

“చెల్లాయ్, నువ్వు ఆధ్యాత్మిక నియమాల్ని నిష్ఠగా పాటిస్తున్నావు; నీకు వచ్చే బహుమతి దగ్గరలోనే ఉంది,” అంటూ కొంటెగా చిరునవ్వు నవ్వాను. “నీకు ఎంత లావవాలని ఉంది? మన అత్తయ్య ఉందే కొన్నేళ్ళుగా తన పాదాలు తను చూసుకోలేకపోతున్నావిడ - ఆవిడంత లావు అవాలని ఉందా?”

“ఉఁహూఁ! నీ అంత లావు కావాలి.”

నేను గంభీరంగా ఇలా అన్నాను: “దేవుడి దయవల్ల, నేనెప్పుడూ నిజమే చెబుతూ ఉన్నాను కనక, ఇప్పుడూ నిజమే చెబుతున్నాను.[1] దేవుడి

  1. ఎప్పుడూ అలవాటుగా నిజం చెప్పే వాళ్ళకి, తాము ఏది అంటే అది జరిగే శక్తి వస్తుందని హిందూ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ హృదయంలోంచి వెలువడ్డమాట జరిగి తీరుతుంది. (“సత్య ప్రతిష్ఠాయాం క్రియా ఫలాశ్రయత్వం”. యోగసూత్రాలు: 2 : 36) లోకాలు సత్యంమీద నిర్మించినవి కాబట్టి, పవిత్ర గ్రంథాలన్నీ దాన్ని శ్రేష్టగుణంగా కీర్తించాయి. ఏ మనిషయినా సరే, దానివల్ల తన జీవితాన్ని అనంత శక్తితో అనుసంధానం చేసుకోవచ్చు నన్నాయి. “సత్యమే భగవంతుడు,” అని గాంధీగారు తరచు అంటూండేవారు. ఆలోచనలో, మాటలో, చేతలో పూర్ణ సత్యం కోసమే ఆయన జీవితమంతా శ్రమించారు. సత్యమనే ఆదర్శం హిందూ సమాజాన్ని యుగయుగాలుగా అనుప్రాణికం కావిస్తూ వస్తోంది.

    ఈ భూమిమీద ఏది ఇచ్చినా సరే బ్రాహ్మణులు అబద్ధమాడరు,” అంటాడు మార్కోపోలో. భారతదేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన విలియం స్లీమన్ అనే ఇంగ్లీషువాడు, ‘జర్నీ త్రూ ఔట్ ఇన్ 1849-59’ అనే గ్రంథంలో అంటాడు: “ఒక్క మనిషి అబద్ధం చెప్పడం మీద ఆధారపడి, అతని ఆస్తికి కాని, స్వేచ్ఛకుకాని, ప్రాణానికికాని సంబంధించిన కేసులు వందలకొద్దీ వచ్చాయి నా దగ్గరికి, కాని అతడు, ససేమిరా అబద్ధం చెప్పనన్నాడు.