ఈ పుట ఆమోదించబడ్డది

అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని

411

అన్నాను విష్ణుతో, వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే. “అనంతుడు ఎప్పుడు పోయాడో నాకూ ఈ డాక్టరుగారికి చెప్పు.”

విష్ణు తేదీ చెప్పాడు; నేను షాంఘైలో కానుకలు కొన్న రోజే అది.

“చూడండి! ఈ సంగతి బయటెక్కడా పొక్కనివ్వకండి! లేకపోతే, ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్యవిద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాదే ఎక్కువ చదివిస్తారు ప్రొఫెసర్లు!” గుర్పార్ రోడ్డులో ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి నాన్న గారు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. “వచ్చావా,” అన్నారు నాన్నగారు మృదువుగా. ఆయన కళ్ళలోంచి రెండు పెద్ద నీటిబొట్లు రాలాయి. మామూలుగా పైకి తొణకని నాన్నగారు, తమ వాత్సల్యాన్ని ఇంతకు ముందెన్నడూ ఈ రకంగా బయటికి కనబరచలేదు. పైకి గంభీరులైన తండ్రి; లోలోపల కరిగిపోయే తల్లిగుండె గలవారు. కుటుంబ విషయాలన్నిటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ వ్యవహరించారు.

అనంతుడు పోయిన కొన్నాళ్ళకే, మా చిన్న చెల్లెలు నళిని దైవోపశమనం వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది. ఆ కథ చెప్పే ముందు, మా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను.

నాకూ నళినికీ మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు. నేను బక్కగా ఉండేవాణ్ణి; తను నా కంటె బక్కపలచగా ఉండేది. అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచు ఏడిపిస్తూ ఉండేవాణ్ణి; దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవ్యాధి నిపుణులకు ఏమంత కష్టం కాదు. తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారుకు సహజమైనంత ఘాటుగాను కుండ బద్దలు కొట్టినట్టు ఉండేవి. ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకునేది; నా చెంప