ఈ పుట ఆమోదించబడ్డది

400

ఒక యోగి ఆత్మకథ

లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు, ఔపచారికమయిన మతసంబంధాలు గలవాడు కావచ్చు.

ఒక స్వామి కేవలం కఠోర త్యాగంతో కూడిన శుష్కమైన జ్ఞాన మార్గాన్ని అనుసరించడం సంభవమే; కాని యోగి కచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై, దాని ద్వారా మనస్సునూ శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మవిముక్తి సాధిస్తాడు. ఆవేళ హేతువుల వల్లనో విశ్వాసంవల్లనో దేన్నీ గుడ్డిగా నమ్మకుండా యోగి, సనాతన ఋషులు ప్రప్రథమంగా గుర్తించి సాకల్యంగా పరీక్షించి చెప్పిన ఆధ్యాత్మిక అభ్యాసాల్ని సాధనచేస్తాడు. భారతదేశంలో ప్రతియుగంలోనూ యోగవిద్య, నిజంగా విముక్తి సాధించిన, క్రీస్తువంటి నిజమయిన యోగీశ్వరుల్ని తయారుచేసింది.

ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగవిద్య, ప్రతి దేశం ప్రజలూ, ప్రతి కాలం ప్రజలూ సాధన చేయ్యదగ్గది. యోగవిద్య పాశ్చాత్యులకు “ప్రమాదకరమైనది” లేదా “నప్పనిది” అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమేకాక, చిత్తశుద్ధి గల విద్యార్థు లనేకమంది యోగవిద్యవల్ల అనేక లాభాలు పొందడానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించినది.

యోగవిద్య, ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులోపెట్టే ఒకానొక పద్ధతి; లేకపోతే ఆ సంక్షోభం సత్యమైన తను ఆత్మస్వరూపాన్ని దర్శించనివ్వకుండా, మానవులందరినీ అన్ని దేశాలవాళ్ళనీ నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది. రోగనివారకమైన సూర్యకాంతి మాదిరిగా, యోగవిద్య, తూర్పుదేశాలవాళ్ళకీ పడమటిదేశాలవాళ్ళకీ కూడా సమానంగా లాభం కలిగిస్తుంది. చాలామంది ఆలోచనలు నిర్విరామమైనవీ నిలకడ