ఈ పుట ఆమోదించబడ్డది

386

ఒక యోగి ఆత్మకథ

ఇంకా ఇలా అన్నాను. “నా అదృష్టంవల్ల, ఈ సంవత్సరం బ్రిటిష్ రచయితల మీద చాలా తక్కువ ప్రశ్నలున్నాయి; వాళ్ళ జీవితాలు, నాకు సంబంధించినంతవరకు, అతిగహనంగా రహస్యపు ముసుగులో మరుగుపడి ఉన్నాయి.”

నేను తిరిగి వెళ్ళేటప్పటికి మా బోర్డింగ్ హౌస్ అరుపులతో దద్దరిల్లి పోయింది. రమేశ్ చెప్పే చదువుమీద నమ్మకం పెట్టుకున్నందుకు నన్ను హేళనచేస్తూ వచ్చిన కుర్రాళ్ళు ఇప్పుడు అభినందనలతో నా చెవులు దాదాపు దద్దరిల్లి పోయేటట్టు చేశారు. పరీక్షల వారం రోజులు నేను వీలున్నంత ఎక్కువసేపు రమేశ్ తోనే గడిపాను; ప్రొఫెసర్లు పరీక్షలో ఇస్తారని తన కనిపించిన ప్రశ్నలు తయారుచేసి పెట్టాడతను. రోజు రోజుకూ రమేశ్ ప్రశ్నలు, దాదాపు అవే మాటల్లో పరీక్షాపత్రాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చాయి.

అద్భుత అలౌకిక చర్యలాంటిదేదో జరుగుతోందనీ, పరధ్యానపు “పిచ్చి సన్యాసి” పరీక్షలో గట్టెక్కేసే అవకాశం కనిపిస్తోందనే ఒక వార్త విస్తృతంగా ప్రచారమయింది. ఇందులో యథార్థాలు కప్పిపుచ్చడానికి నే నే ప్రయత్నమూ చెయ్యలేదు. కలకత్తా విశ్వవిద్యాలయం విద్వాంసులు తయారుచేయించిన ప్రశ్నల్ని మార్చడానికి అధికారం, ఇక్కడి అధ్యాపకులకు లేదు.

ఆంగ్లభాషాసాహిత్య పరీక్షనుగురించి ఆలోచిస్తూ ఒకనాడు పొద్దున, నేనో ఘోరమైన తప్పు చేశానని గ్రహించాను. కొన్ని ప్రశ్నలు రెండు భాగాలుగా ఇచ్చారు: ‘ఎ’ కాని ‘బి’ కాని; ‘సి’ కాని ‘డి’ కాని. నేను ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న ఎన్నుకోడానికి బదులు, మొదటి భాగంలోనే రెండు ప్రశ్నలకు జవాబులు రాసి, అజాగ్రత్తవల్ల రెండో భాగాన్ని పట్టించుకోలేదు. ఆ పేపరులో నేను తెచ్చుకోగల ఎక్కువ