ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

381

ముక్కలతో నా సమాధానాల్ని అందంగా అలంకరించకపోయినప్పటికీ, వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారు.[1]

నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి, “ఇది వట్టి, సిగ్గుచేటు అదృష్టం!” అంటూ ఉరిమారాయన. అయినా, “బి. ఏ. ఫైనల్స్‌లో నువ్వు ఫెయిలవడం ఖాయం!” అంటూ తమ ఆశాభావం వెలిబుచ్చారు.

నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షలకోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నాను. ముఖ్యంగా, నాకు ప్రియమిత్రుడయిన మా శారద బాబయ్యగారబ్బాయి ప్రభాస్ చంద్రఘోష్ నాకు చాలా చెప్పాడు. అవస్థపడుతూ కాస్త ఊగిసలాడినా, మొత్తం మీద నేను చివరి పరీక్ష లన్నింటిలోనూ పాసవడానికి రావలసిన కనీసపు మార్కులు తెచ్చుకుని ఎలాగో బయటపడ్డాను.

నాలుగేళ్ళు కాలేజి చదువు పూర్తయిన తరవాత, ఇక నేను బి. ఏ. పరీక్షలకు కూర్చోడానికి అర్హుణ్ణి అయాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలనని కలలో కూడా అనుకోలేదు. బి. ఏ. డిగ్రీకి కలకత్తా విశ్వవిద్యాలయం పెట్టే కఠిన పరీక్షలముందు, శ్రీరాంపూర్ కాలేజి చివరి పరీక్షలు చిన్న పిల్లల ఆటల్లాంటివి. దాదాపు ప్రతి రోజూ నేను శ్రీయుక్తేశ్వర్‌గారి దర్శనానికి వెళ్తూండడంవల్ల కాలేజి హాళ్ళలోకి ప్రవేశించడానికి నాకు టైమే మిగలలేదు. అక్కడ నా సహాధ్యాయులు,

  1. ప్రొఫెసర్ ఘోషాల్ గారికి నాకూ గల సంబంధం సజావుగా లేకపోవడానికి కారణం ఆయన తప్పేమీ కాదనీ, కేవలం క్లాసుల్లో నా గైర్‌హాజరీలేననీ నా తప్పు ఒప్పుకొని ఆయనకు న్యాయం చెయ్యక తప్పదు. ప్రొఫెసర్ ఘోషాల్ గారు అపారమైన తత్త్వశాస్త్ర జ్ఞానంగల గొప్ప వక్త. అనంతర కాలంలో మేము సౌహార్దపూర్వకమైన పరస్పరావగాహనకు వచ్చాం.