ఈ పుట ఆమోదించబడ్డది

20

ఒక యోగి ఆత్మకథ

కప్పుమీదా ఉన్నారు. ఆ ఇద్దరి ఇళ్ళకీ మధ్యలో చాలా చిన్న సందులో ఉంది మా ఇల్లు.

“అంత నిశ్శబ్దంగా ఉన్నావేం?” అంటూ ఉమ, సరదాగా నన్ను తోసింది.

“ఏం లేదు− నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను.”

“అమ్మవారు నీ కీ రెండు గాలిపడగలూ ఇస్తుందనుకుంటాను!” అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క.

“ఎందుకివ్వదు?” వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను.

భారతదేశంలో గాలిపడగలు ఎగరేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక, గాజుపొడి పూసి ఉంటాయి. ప్రతి ఆటగాడూ, తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసెయ్యడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ళ, కప్పులమీద తేలిపోతూ ఉంటుంది; దాన్ని పట్టుకోవడంలో బలే సరదా ఉంది. నేనూ ఉమా ఉన్నది. పై కప్పున్న గూడుమాదిరి బాల్కనీ కావడంవల్ల , తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది; దాని దారం ఇంటికప్పు మీద వేలాడుతూ ఉంటుంది.

మా సందుకు ఈ వైపూ ఆ వైపూ ఉన్న ఆటగాళ్ళు పోటీ మొదలు పెట్టారు. ఒక దారం తెగింది; దానికున్న గాలిపడగ, తేలుతూ నా వేపు వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడంవల్ల, ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం, ఎదురింటి కప్పుమీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో, నేను