ఈ పుట ఆమోదించబడ్డది

366

ఒక యోగి ఆత్మకథ

గురించిన జ్ఞానం ఉదయించినప్పుడు, శరీరానికున్న మిథ్యాత్వంవల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలన్న వేవీ ఉండవు.”

మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు. శ్రీయుక్తేశ్వర్‌గారు, తమ శిష్యులకు ఆ విచిత్రరీతిలో సహాయపడడానికి తమలోని చిచ్ఛక్తి నుంచి అనుమతిపొంది ఉంటేనే కాని శ్రీనగర్[1]లో జబ్బుపడి ఉండేవారు కారు. దైవాజ్ఞల్ని పాలించడానికి సమకూరిన సునిశితమైన జ్ఞానంలో దైవానుసంధాన పరాయణులైన మా గురుదేవుల్ని మించినవాళ్ళు సకృతు.

బాగా చిక్కిపోయిన ఆయన శరీరాన్ని చూసి సానుభూతితో

  1. కాశ్మీర రాజధాని శ్రీనగర్‌ను అశోక చక్రవర్తి క్రీ. పూ. మూడో శతాబ్దిలో నిర్మించాడు. అక్కడాయన 500 మఠాలు కట్టించాడు. తరవాత వెయ్యి సంవత్సరాలకు హ్యూయెన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు కాశ్మీరు దర్శించిన నాటికి వాటిలో ఇంకా 100 మఠాలు నిలిచి ఉన్నాయి. ఫాహియాన్ (ఐదో శతాబ్ది) అనే మరో చైనా రచయిత, పాటలీపుత్రం (ఇప్పటి పాట్నా) లో ఆశోకుడు నిర్మించిన విశాల రాజప్రసాదం శిథిలాలు చూసి, వాస్తుకళలోనూ అలంకరణ శిల్పకళలోనూ ఆ నిర్మాణానికిగల అద్భుత సౌందర్యాన్ని బట్టి అది, “మానవమాత్రుల చేతుల్లో తయారయింది కాదు” అనిపిస్తుందని రాశాడు.

    పాటలీపుత్ర నగరానికి ఆకర్షకమైన చరిత్ర ఉంది. బుద్ధ భగవానుడు క్రీ. పూ. ఆరో శతాబ్దిలో దర్శించిననాటికి ఈ ప్రదేశంలో అనామకమైన ఒక చిన్నకోట ఉండేది. ఆయన దీని భవిష్యత్తునుగురించి జోస్యం చెబుతూ, “ఆర్యజాతి జనులు ఏయే దూరప్రాంతాల్లో నివసిస్తారో, వర్తకులు ఏయే దూరప్రాంతాలకు ప్రయాణిస్తారో అక్కడివరకు ఈ పాటలీపుత్రమే ప్రధాన నగరమవుతుంది; అన్ని రకాల వస్తువుల క్రయవిక్రయాలకూ కేంద్రమవుతుంది,” (మహాపరినిర్వాణ సూత్రం) అన్నాడు. రెండు శతాబ్దుల తరవాత ఈ పాటలీపుత్రం చంద్రగుప్త మౌర్యుడి విశాల సామ్రాజ్యానికి రాజధాని అయింది; ఆయన మనమడు అశోకుడు ఈ నగరానికి ఇతోధిక వైభవాన్నీ శోభను చేకూర్చాడు.