ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

361

తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తాడు. ధనవంతుడొకడు, వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి దానివల్ల కలిగే విపత్కర పరిణామాలనుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో, అదే విధంగా గురువు, తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు.

ఒకానొక రహస్య యోగపద్ధతి ద్వారా సాధువు తన మనస్సునూ సూక్ష్మదేహాన్నీ పీడిత వ్యక్తి మనస్సుతోనూ సూక్ష్మదేహంతోనూ అనుసంధానం చేస్తాడు. ఆ జబ్బు పూర్తిగాగాని కొంతమట్టుకుగాని యోగి భౌతికరూపానికి సంక్రమించడం జరుగుతుంది. అయితే యోగి, దేహమనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్పవేసుకున్నందువల్ల ఇక ఆ దేహంతో ఆయనకి ప్రమేయం ఉండదు. ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాన్ని జబ్బుపడనిచ్చినా, కాలుష్యానికి లోనుకాజాలని ఆయన మనస్సు, ఎటువంటి ప్రభావానికి లోనుకాదు. అటువంటి సహాయం చెయ్య గలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు. చివరికి మోక్షం పొంది ఈశ్వరసాయుజ్యం సాధించడమంటే, నిజానికి, మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవేర్చేటట్టు చూడడమే; అప్పుడు యోగి దాన్ని, తనకు ఉచితమని తోచిన విధంగా చేస్తాడు.

ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నయితేనేమి, జ్ఞానోపదేశం ద్వారా నయితేనేమి, సంకల్పశక్తి వల్ల నయితేనేమి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడంవల్ల నయితేనేమి మానవజాతి దుఃఖాల్ని నివృత్తి చెయ్యడమే లోకంలో గురువు చేసే పని. గురువు, తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడు; ఒక్కొక్కప్పుడు తన శిష్యులకొక ఆదర్శం నిరూపించడంకోసం