ఈ పుట ఆమోదించబడ్డది

360

ఒక యోగి ఆత్మకథ

ఇవ్వండి. మీరు లేకుండా గడుపుకోడానికి నేను బొత్తిగా సిద్ధపడలేదు.” అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన పాదాల మీద పడ్డాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు మౌనం వహించారు; కాని దయార్ద్రదృష్టితో ఆయన నవ్విన చిరునవ్వువల్ల ఆయన నాకు భరోసా ఇచ్చినట్టనిపించింది. మనస్సు ఒప్పకపోయినా ఆయన్ని విడిచి వెళ్ళిపోయాను.

“గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉన్నారు.” ఆడీ ఇచ్చిన ఈ తంతి, నేను శ్రీరాంపూర్‌కు తిరిగివచ్చిన కొన్నాళ్ళకు నాకు అందింది.

“గురుదేవా, మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్నికోరుకున్నాను. మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి; లేకపోతే నేను కూడా చచ్చిపోతాను,” అంటూ నేను వ్యగ్రంగా మా గురుదేవులకు ఒక తంతి ఇచ్చాను.

“నీ కోరికే నెరవేరనియ్యి.” కాశ్మీరు నుంచి గురుదేవుల సమాధాన మిది.

కొన్నాళ్ళలో ఆడీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది; అందులో, గురుదేవులు కోలుకున్నారని రాశాడు. ఆ మరుసటి పక్షంలో శ్రీరాంపూర్ కు తిరిగి రాగానే గురుదేవుల దేహాన్ని చూద్దునుకదా, బరువుతగ్గి చిక్కి సగమయారు. నా కెంతో దుఃఖం కలిగింది.

శ్రీయుక్తేశ్వర్‌గారు, శిష్యుల అదృష్టంవల్ల, వాళ్ళ పాపాల్లో చాలా మట్టుకు కాశ్మీరులో ఆయనకు వచ్చిన తీవ్రజ్వరాగ్నిలో దగ్ధం చేసేశారు. జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి, బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు. బలహీనుడు పెద్ద బరువు మోసుకోడానికి బలమయినవాడు సాయపడవచ్చు; ఆధ్యాత్మికంగా ఉత్కృష్టస్థితి నందుకున్న అతీత మానవుడు, కర్మ సంబంధమైన భారాల్లో కొంతభాగం