ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

359

గుహలూ చిత్రమైన గంధర్వ లోకాలు. గుహల పై కప్పులనుంచి కిందికి వేలాడుతూ కింది నీళ్ళలో ప్రతిబింబించే పొడుగాటి సున్నపురాతి స్తంభాలు, మానవుడు ఊహించిన పరలోక సౌందర్యాన్ని ప్రకాశింప చేస్తాయి.

కాశ్మీరులో, అందానికి ప్రపంచ ప్రఖ్యాతిపొందిన ప్రజలు చాలామంది, యూరోపియన్లంత తెల్లగానూ ఉంటారు; వాళ్ళలాగే మొక్కట్లు, అస్థినిర్మాణమూ ఉంటాయి; చాలామందికి నీలికళ్ళూ లేతవన్నె జుట్టూ ఉంటాయి. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాళ్ళు అమెరికన్లలా కనిపిస్తారు. హిమాలయాల చల్ల దనం కాశ్మీరీలకు, ఎండ ఉడుకుకు ఉపశమనం కలిగించి శరీరచ్ఛాయ లేతవన్నెలో, ఉండేటట్టు చేస్తుంది. భారతదేశపు ఉష్ణమండల అక్షాంశరేఖల వెంబడి దక్షిణాన దిగవకు ప్రయాణం చేసేవాళ్ళు, రానురాను మరింత నలుపుదేరినవాళ్ళను చూస్తారు.

కాశ్మీరులో కొన్ని వారాలపాటు ఆనందంగా గడిపిన తరవాత, శ్రీరాంపూర్ కాలేజిలో శీతాకాలపు టెండకు అందుకోడానికని బెంగాలుకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. శ్రీయుక్తేశ్వర్‌గారు, కనాయి, ఆడీ శ్రీనగర్‌లో మరికొన్నాళ్ళపాటు ఉండిపోవలసి వచ్చింది. నేను బయలుదేరడానికి కొద్దిగా ముందు గురుదేవులు, తమ దేహం కాశ్మీరులో బాధకు గురికావలసి వస్తుందని సూచనగా తెలియజేశారు.

“గురుదేవా, మీ ఆరోగ్యం నిక్షేపంలా ఉంది,” అన్నాను నేను అభ్యంతరం తెలుపుతూ.

“నేను ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు,” అన్నారాయన.

“గురూజీ! ఇప్పుడప్పుడే ఈ దేహాన్ని విడిచిపెట్టనని మాట