ఈ పుట ఆమోదించబడ్డది

336

ఒక యోగి ఆత్మకథ

చాను.” గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా, చాలా స్వాభావికంగా ఉంది. “ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయింది; పదిగంటల బండిలో శ్రీరాంపూర్‌లో దిగుతాను,” అన్నాడు.

నే నింకా మూగబోయి తేరిపారిచూస్తుంటే, శ్రీయుక్తేశ్వర్‌గారు ఇంకా ఇలా అన్నారు: “ఇది నా ఛాయారూపం కాదు; నా రక్త మాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్‌లో కలుసుకో; ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురురావడం, నువ్వూ దిజేనూ చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు - వెండి మరచెంబు పట్టుకువచ్చే చిన్న కుర్రవాడు.”

మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తలమీద రెండు చేతులు పెట్టారు. “తబే ఆసి”,[1] అన్న మాటలలో ఆయన ముగిస్తూ ఉండగా, చిత్రమైన ఒక దుర్మరధ్వని విన్నాను.[2] ఆయన శరీరం క్రమంగా మిరుమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలయింది. చుట్ట చుడుతున్న ఒక కాయితంలాగ, మొదట ఆయన పాదాలూ, కాళ్ళూ అదృశ్యమయాయి; ఆ తరవాత మొండెమూ, తలా. ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ళ స్పర్శ చిట్టచివరిదాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్జ్వలకాంతి కరిగిపోయింది; నా ఎదురుగా చువ్వల కిటికీ, పలచని ఎండపొడా మినహా మరేమీ మిగలలేదు.

ఒకవేళ నేను భ్రమకు గురికాలేదు కదా, అని వితర్కించుకుంటూ

  1. “వెళ్ళొస్తా” నని బెంగాలీలో చెప్పే తీరు. దీనికి వాఖ్యార్థం, “అప్పటికి వస్తా” నని; ఇందులో ఆశావహమైన వైరుధ్యం ఉంది.
  2. శరీర కోశాణువులు విఘటనం చెందినప్పుడు వచ్చే విలక్షణమైన శబ్దం.