ఈ పుట ఆమోదించబడ్డది

326

ఒక యోగి ఆత్మకథ

నీ పేరు రాయి, తరవాత దాన్ని నీ సత్తువకొద్దీ గంగలోకి దూరంగా విసిరెయ్యి.’ ”

“అలాగే చేశాను. ఆ రాయి, దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమయిన తరవాత, ఆ ముస్లిం మళ్ళీ ఇలా చెప్పాడు:”

“ ‘ఈ ఇంటి ముంగిలి దగ్గర ఒక కుండనిండా గంగాజలం పొయ్యి.’ ”

“నేను నీళ్ళకుండతో తిరిగి వచ్చిన తరవాత ఆ ఫకీరు, ‘హజరత్, ఆ రాతిని ఈ కుండలో పెట్టు!’ అన్నాడు.”

‘‘వెంటనే రాయి కనిపించింది. దాన్ని పైకి తీశాను. దానిమీద నా సంతకం, నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.

“గదిలో ఉన్న వాళ్ళలో బాబు[1] అని నా స్నేహితుడొకడు ఉన్నాడు. అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసుతో సహా చేతికి పెట్టుకొని ఉన్నాడు. ఫకీరు వాటిని వాపిరిగొట్టులా తడిమిచూశాడు. అంతే; చటుక్కున అవి మాయమయాయి!”

బాబుకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. “అఫ్జల్, దయచేసి మా పెద్దలనాటి అమూల్య వస్తువు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చెయ్యి!”

“ఆ ముస్లిం కొంచెంసేపు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నాడు. ఆ తరవాత అన్నాడు: ‘ఇనప్పెట్టెలో నీకు ఐదువందల రూపాయలు ఉన్నాయి. అవి తెచ్చి నా కియ్యి; నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెబుతాను.’ ”

  1. శ్రీయుక్తేశ్వర్‌గారి స్నేహితుడి పేరు నాకు గుర్తురావడం లేదు; అంచేత ఉత్తినే “బాబు” అని రాస్తున్నాను.