ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

305

మానవ ఇంద్రియానుభూతు లన్నిటినీ అనుభవించమని చెప్పడం జరిగింది. ఒక్క కామవాసనల్ని తప్ప.[1] వంశవృద్ధికోసం మానవుల్ని హీనస్థాయి జంతుపద్ధతికి బందీని చేసే జననేంద్రియాల ఉపయోగాన్ని తొలగించడానికే వీటిని నిషేధించడం జరిగింది. అవచేతన మనస్సులో పశుప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్ళీ తలఎత్తకుండా చెయ్యడంకోసం దేవుడు చేసిన హెచ్చరికను మనిషి చెవిని పెట్టలేదు. ఆదాము, అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి, పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానందస్థితినుంచి పతనమయారు. “తాము నగ్నంగా ఉన్నామని తెలిసి”నప్పుడు, దేవుడు హెచ్చరించినట్టుగానే, వాళ్ళలో అమరత్వబోధ నశించింది. శారీరకమైన పుట్టుక తరవాత శారీరకమైన గిట్టుక రావాలన్న భౌతికశాస్త్ర నియమానికి వాళ్ళు బానిస లయిపోయారు.

“అవ్వకు ‘సర్పం’ ఇవ్వజూపిన ‘మంచి-చెడ్డ’ల జ్ఞానం మాయలో మర్త్యులు అనుభవించి తీరవలసిన ద్వంద్వ భావాత్మకమైన, లేదా పరస్పర విరుద్ధమైన అనుభవాల్ని సూచిస్తుంది. మానవుడు, స్త్రీపురుష చైతన్యమనే అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల భ్రాంతిలో పడి, దివ్య సృయంసమృద్ధి అనే స్వర్గవాటికలోకి ప్రవేశించే హక్కు కోల్పోయాడు.[2] తన ‘తల్లి దండ్రుల్ని’, అంటే ద్వంద్వప్రకృతిని ఏకీకృత

  1. “అప్పుడు సర్పం (లైంగిక శక్తి), భూమి మీదున్న జంతువులన్నిటి కన్న (శరీరంలోని ఇంద్రియాలన్నిటికన్న) చాలా సూక్ష్మంగా (చతురంగా, ధూర్తంగా) తయారయింది.” - జెనిసిస్ 3 : 1.
  2. ప్రభువైన దేవుడు ఈడెన్‌లో తూర్పువైపున ఒక తోట పెంచాడు. తాను రూపొందించిన మానవుణ్ణి అక్కడ ఉంచాడు. - జెనిసిస్ 2-8. “అందువల్ల ప్రభువైన దేవుడు, ఏ నేలమీది మట్టితో అతన్ని చేశాడో ఆ నేలనే తవ్వుకోమని వెంటనే అతన్ని ఈడెన్ తోటలోంచి పంపేశాడు.” - జెనిసిస్ 3 : 23. దేవుడు మొదట సృష్టించిన దివ్యమానవుడికి అతని నుదుటిమీది (తూర్పు వైపు) సర్వశక్తిమంతమైన ఒంటికంటిలోనే అతని చైతన్యం కేంద్రీకృతమై ఉండేది. మనిషి తన భౌతిక ప్రకృతి అనే “నేలను తవ్వడం” మొదలు పెట్టినప్పుడు, ఆ బిందువుమీద కేంద్రీకృతమైన అతని సర్వసృజనాత్మక శక్తులు విచ్ఛిన్నమయాయి.