ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

299

మానవమేధ సర్వోత్కృష్టంగా వికాసం చెందుతుంది, మానవుడు దైవనిర్ణీత పథకానికి అనుకూలంగా పనిచేస్తాడు.

ప్రపంచానికి అప్పుడు, 4800 సంవత్సరాల అవరోహణ స్వర్ణ యుగంతో ఆరంభమయే 12,000 సంవత్సరాల అవరోహణచాపం మొదలవుతుంది (క్రీ. శ. 12,500); క్రమశః మానవుడు, అజ్ఞానంలోకి దిగజారి పోతాడు. ఈ కాల చక్రభ్రమణాలు, దృగ్గోచర విశ్వం తాలూకు వైషమ్య సాపేక్షతారూపకమైన ‘మాయ’ ప్రదర్శించే శాశ్వత ఆవృత్తులు.[1] మాన

  1. ఇప్పటి ప్రపంచం ఆయుర్దాయం, శ్రీ యుక్తేశ్వర్‌గారు చెప్పిన 24,000 సంవత్సరాల అయనచక్రం కన్న చాలా దీర్ఘమైన విశ్వచంద్రంలోని కలియుగంలో ఒక అంతర్భాగంగా హిందువుల శాస్త్రగ్రంథాలు నిర్ణయించాయి. ఈ గ్రంథాల్లో చెప్పిన విశ్వచక్రం కాలవిస్తృతి 450,05,60,000 సంవత్సరాలు. ఇది ఒక సృష్టికల్పంగా లెక్కకు వస్తుంది; అంటే సృష్టికి ఒక దినం. ఇది ఇప్పటిరూపంలో మన గ్రహమండలానికి నిర్ధారణ చేసిన ఆయుఃప్రమాణ మన్న మాట. ఋషులు ఇచ్చిన ఇంత పెద్దసంఖ్య సౌరసంవత్సరం పొడుగుకూ ‘పై’ (అంటే, ఒక వృత్తం చుట్టుకొలతకూ వ్యాసానికీ ఉండే అనుపాతం ఈ ; 1.1416) గుణిజానికి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంది. ప్రాచీన ద్రష్టల దృష్టిలో అఖండ బ్రహ్మాండం ఆయుర్దాయం 514, 15900, 00, 00, 000 సౌరసంవత్సరాలు; అంటే “ఒక బ్రహ్మయుగం” హిందూ పవిత్ర గ్రంథాల్లో, మనం నివసించే భూమిలాంటి గ్రహం లయం కావడానికి కారణాలు రెండు చెప్పారు: లోకంలో ఉండేవాళ్ళు మొత్తమంతా పూర్తిగా మంచివాళ్ళయినా అయిపోవడం, లేదా పూర్తిగా చెడ్డవాళ్ళయినా అయిపోవడం. ఈ రెండింటిలో ఏ ఒక్కదానివల్లనయినా ప్రళయం సంభవించవచ్చునన్నారు. ఈ విధంగా లోకమానసం ఒకానొక శక్తిని ఉద్భూతం చేస్తుంది; ఆ శక్తి, భూమ్యాకారంలో సంఘటితమై ఉన్న బంధితాణువుల్ని విడుడల చేస్తుంది. ఇదుగో, ప్రపంచ ప్రళయం రాబోతోందంటూ అప్పుడప్పుడు భయంకరమైన ప్రకటనలు ప్రచురిస్తూ ఉంటారు. అయినప్పటికీ గ్రహచక్రభ్రమణాలు ఒకక్రమబద్ధమైన దివ్య ప్రణాళిక ప్రకారం కొనసాగుతూనే ఉన్నాయి. భూప్రళయ మేదీ కనుచూపుమేరలో లేదు; ప్రస్తుత రూపంలో మన గ్రహానికి ఇంకా అనేకమైన ఆరోహణ, అవరోహణ అయనచక్రాలు గడవవలసి ఉన్నాయి.