ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

273

వ్యాపకమైన ఆత్మేకాని ఎక్కడో ఒక చోటికి కట్టుబడ్డ శరీరం మాత్రం కాదు.

“అత్యంత అపూర్వమైన, అత్యద్భుతమైన, అత్యంత అసంభావ్యంగా పైకి కనిపించే దృగ్విషయాలు ఇకముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడ్డ తరవాత, వాటిని చూసి, గడిచిన శతాబ్దిలో విజ్ఞానశాస్త్రం మనకి నేర్పినదంతా చూసి మనమిప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకుమించి మాత్రం ఆశ్చర్యపోము,” అని ఉద్ఘాటించాడు, శరీరశాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ రిషే.[1] “మన మీనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనికి అర్థమై ఉండడమే నని భావించడం జరిగింది. కాని అసలు సంగతి ఇది కాదు. అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవడానికి కారణం, అవి మనకి అర్థమై ఉండడంకాదు; అవి మనకి పరిచితమై ఉండడం. అలా కాకపోతే, మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతిదీ ఆశ్చర్యమే కలిగించాలి -- గాలిలోకి విసిరిన రాయి కిందికి పడడం, సిందూరపు కాయ సిందూరపు చెట్టు కావడం, వేడిచేసినప్పుడు పాదరసం వ్యాకోచించడం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము, రాపాడించినప్పుడు రగులుకొనే భాస్వరం, ఇలాటి వన్నీ.

“ఈనాటి విజ్ఞానశాస్త్రం తేలికయిన విషయం” మన సంతతివాళ్ళు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి; మన కళ్ళలోకి తేరిపారి చూస్తున్నాయని చెప్పొచ్చు. అయినా మనం వాటిని చూడం. మనం వాటిని చూడమని చెబితే చాలదు; వాటిని

  1. ‘అవర్ సిక్త్స్ సెన్స్’ అన్న పుస్తకం రాసినాయన (లండన్ : రెడర్ అండ్ కంపెనీ)