ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

259

జీవనం గడుపుతారు. ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోలోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు.

“ఈశ్వరుడు మానవులందరినీ తన ఉనికికున్న అపరిమితానందం లోంచి సృష్టించాడు. మానవులు, బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు, తన రూపంలో తయారయిన మానవులు చివరికి ఇంద్రియావరోధాలన్నింటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు.

ఈ విశ్వచేతనాదృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది. నా ఆలోచనల్ని ప్రతిరోజూ నిశ్చలంచేస్తూ, నా శరీరం భౌతికపదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్థికల ముద్ద అనే భ్రాంతిపూర్వకమైన దృఢవిశ్వాసంలోంచి బయటపడ్డాను. ఊపిరి, నిలకడలేని మనస్సూ కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి, ఆకాశం, మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లూ వంటి భౌతికపదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానుల వంటివన్న సంగతి గమనించాను. ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలగడం జరగదు.

ఈ రెండు సహజ సంక్షోభాల్నీ నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా, తుఫాను అణిగిపోయిన తరవాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టితరంగాలు తేజస్సాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను.

విశాలమైన దృశ్యాలు తనను తబ్బిబ్బు చెయ్యనంతటి స్థాయివరకు శిష్యుడు ధ్యానంవల్ల మనస్సును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు. కేవలం ప్రాజ్ఞ సంబంధమైన సంకల్పంకాని నిష్కాపట్యంకాని చాలవు. యోగసాధనవల్లా భక్తివల్లా తగినంతగా విస్తృతిచెందిన చైతన్య మొక్కటే, సర్వవ్యాపకత్వంవల్ల