ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపోని సాధువు

249

రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తరవాత అంత కన్న దుర్గమమైన గుహకి మారి, అక్కడ ఇరవైఅయిదేళ్ళు ఉన్నాను; రోజుకు ఇరవైగంటలు యోగసమాధిలో ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఈశ్వరసాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయేది కాదు. నా శరీరం, మామూలు అవచేతనస్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతికన్న, అధిచేతనస్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతితోనే ఎక్కువ విశ్రాంతి పొందేది.

“కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి; కాని గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ మండలం ఎడతెరపిలేకుండా పనిచేస్తూనే ఉంటాయి; వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతనస్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తిచేత విద్యుత్ప్రేరితాలయి, తాత్కాలికంగా నిశ్చలస్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు ఏళ్ళతరబడిగా నిద్రే అవసరం లేకపోయింది.” ఆయన ఇంకా ఇలా అన్నారు, “నువ్వు కూడా నిద్రకు స్వస్తిచెప్పే కాలం వస్తుంది.”

“అమ్మయ్యో! అంత ఎక్కువకాలం ధ్యానం చేసికూడా మీరు, ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్న మాట!” అని వ్యాఖ్యానించాను, ఆశ్చర్యపోతూ. “అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి?”

“ఇదుగో బాబూ, దేవుడంటే అనంతత్వమేనని తెలియడం లేదూ? నలభై ఐదేళ్ళ ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోడం దురాశే అని చెప్పొచ్చు. అయితే, కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యుభయంనుంచీ, మరణానంతరస్థితుల భయం నుంచీ రక్షిస్తుందని బాబాజీ మనకి హామీ ఇస్తారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న గుట్టలమీద నిలపకు; నిర్నిబద్ధమైన భగవత్ప్రాప్తి