ఈ పుట ఆమోదించబడ్డది

248

ఒక యోగి ఆత్మకథ

దూరమనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగుతో చిత్రంగా ప్రకాశిస్తున్నది. రామగోపాల్‌గారు చిరిగిన కంబళ్ళు నేలమీద పరిచి నాకు పక్కవేశారు. తాము మాత్రం ఒక తుంగ చాపమీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణిఅయి, ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను.

“అయ్యా, మీరు నాకు సమాధిస్థితి ఎందుకు ప్రసాదించరు?”

“నాయనా, దివ్యానుసంధానం కలిగించడం నాకూ సంతోషమే; కాని అది జరగవలసింది ఇక్కడ కాదు.” ఆ సాధువు, అరమోడ్చిన కన్నులతో నావేపు చూశారు. “మీ గురువుగారు త్వరలో నీ కా అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికింకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుద్భలం (ఎలక్ట్రికల్ వోల్టేజి) వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో, అలాగే నీ నరాలు కూడా విశ్వవిద్యుత్ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నేను నీకు బ్రహ్మానందానుభవాన్ని కలిగించినట్లయితే, నీలో కణకణం నిప్పులమీద ఉన్నట్టుగా అయి మాడిపోతావు.”

ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు: “లెక్కలోకి రాదగనివాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసినవాణ్ణి - దేవుణ్ణి సంతోష పెట్టడంలో కృతార్థుణ్ణి అయానో లేదో, కడపటి తీర్పునాటికి ఆయన దృష్టిలో నాకు ఏపాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటూంటే, నువ్వు నా దగ్గిర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు.”

“అయ్యా , మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్యభక్తితో అన్వేషించడం లేదా?”

“నేను అట్టే చెయ్యలేదు. బిహారి నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. ఇరవై ఏళ్ళపాటు నేను ఒక రహస్యగుహలో